Flipkart flagship sale: ఆ సౌండ్ బార్‌లపై డిస్కౌంట్ల మేళా.. ఫ్లిప్‌కార్ట్‌లో నమ్మలేని తగ్గింపులు

|

Aug 12, 2024 | 8:15 PM

ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ప్రాణంగా చూసుకుంటారు. దానిలో అన్ని రకాల వసతులు కల్పించడానికి ప్రత్యేకంగా ఆలోచిస్తారు. టీవీ, ఫ్రిజ్, ఇంటిరియల్ డిజైన్ ఇలా అన్ని లేటెస్ట్ గా ఏర్పాటు చేసుకుంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో టీవీలో తమకు నచ్చిన కార్యక్రమాలు వీక్షించడానికి ఇష్టపడతారు. ఇలాంటి వారికి సౌండ్ బార్ లు చాలా ఉపయోగపడతాయి. టీవీలో వచ్చే కార్యక్రమాలకు సంబంధించిన సౌండ్ ను ఆహ్లాదంగా వినిపిస్తాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్ లో బోట్, మివీ, ఫిలిప్స్ తదితర ప్రముఖ కంపెనీల సౌండ్‌బార్‌లు అందుబాటులో ఉన్నాయి.

Flipkart flagship sale: ఆ సౌండ్ బార్‌లపై డిస్కౌంట్ల మేళా.. ఫ్లిప్‌కార్ట్‌లో నమ్మలేని తగ్గింపులు
Best Sound Bar
Follow us on

ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ప్రాణంగా చూసుకుంటారు. దానిలో అన్ని రకాల వసతులు కల్పించడానికి ప్రత్యేకంగా ఆలోచిస్తారు. టీవీ, ఫ్రిజ్, ఇంటిరియల్ డిజైన్ ఇలా అన్ని లేటెస్ట్ గా ఏర్పాటు చేసుకుంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో టీవీలో తమకు నచ్చిన కార్యక్రమాలు వీక్షించడానికి ఇష్టపడతారు. ఇలాంటి వారికి సౌండ్ బార్ లు చాలా ఉపయోగపడతాయి. టీవీలో వచ్చే కార్యక్రమాలకు సంబంధించిన సౌండ్ ను ఆహ్లాదంగా వినిపిస్తాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్ లో బోట్, మివీ, ఫిలిప్స్ తదితర ప్రముఖ కంపెనీల సౌండ్‌బార్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా దాదాపు 80 శాతం డిస్కౌంట్ పై లభిస్తున్నాయి. ఆగస్టు 6న ప్రారంభమైన ఈ సేల్ ఆగస్టు 12 వరకూ కొనసాగుతుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, దుస్తులు, గృహాపకరణాలు, ఇతర అనేక వస్తువులను తక్కువ ధరకు అందిస్తున్నారు. ఐసీఐసీఐ, ఎస్ బ్యాంకులకు సంబంధించిన డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించే వారికి అదనపు తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌లు కూడా ఇస్తున్నారు. ఈ సేల్ లో అందుబాటులో ఉంచిన సౌండ్ బార్ ల వివరాలు తెలుసుకుందాం.

ఫిలిప్స్ బ్లూటూత్ సౌండ్‌బార్

టీవీ, మానిటర్లకు సులభంగా కనెక్ట్ చేసుకోగలిగే వీలున్న ఫిలిప్స్ బ్లూటూత్ సౌండ్‌బార్ డాల్బీ అట్మాస్ పై దాదాపు 23 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. దీనిలో ఒక సౌండ్‌బార్, రెండు స్పీకర్లు, ఒక సబ్‌వూఫర్ ఉన్నాయి. వీటితో పాటు ఏఐ వాయిస్ అసిస్ట్‌ కూడా ఏర్పాటు చేశారు. బ్లూటూత్ ద్వారా స్పష్టమైన ధ్వనిని అందిస్తుంది. దీనిలోని మల్టీపాయింట్ టెక్నాలజీని ఉపయోగించి ప్రధాన పరికరంతో రెండు అదనపు పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు. వాల్యూమ్, ప్లే, పాజ్, ట్రాక్ కంట్రోల్ తదితర నియంత్రణలను సులభంగా చేసుకోవచ్చు. ఫిలిప్స్ సౌండ్‌బార్ ధర రూ. 39,998.

బోట్ అవంటే బార్ 3100డీ

డాల్బీ అట్మాస్ స్పేషియల్ ఆడియో టెక్నాలజీతో కూలిన బోట్ అవంటే బార్ 3100డీ సౌండ్ బార్ ద్వారా చాలా స్పష్టమైన ఆడియోను వినవచ్చు. పాటలు, సంగీతం, చిత్రాలు తదితర వాటిని వీక్షించే సమయంలో చాలా ఉపయోగంగా ఉంటుంది. దీనిలో బ్లూటూత్ పరిధి పది మీటర్లు ఉంటుంది. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఆడియో పరికరంతో ఎల్లప్పుడూ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీనిలో 5.1 ఛానల్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ మరో ప్రత్యేకత. బోట్ సౌండ్‌బార్ రూ.10,999 కు అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మివీ ఫోర్ట్ ఎస్660

మంచి ఆడియో కోసం ఎదురు చూసే వారికి మివీ ఫోర్ట్ ఎస్66 సౌండ్ బార్ చాలా ఉపయోగంగా ఉంటుంది. దీనిలో రెండు శాటిలైట్ స్పీకర్లు, శక్తివంతమైన సబ్‌ వూఫర్‌ ఉన్నాయి. ఇవి డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తాయి. సినిమాలు, వెబ్ షోలను వీక్షించేటప్పుడు అల్ట్రా ఇమాజినరీ సినిమాటిక్ ఆడియో అనుభూతిని పొందవచ్చు. స్ట్రీమింగ్ అవుతున్న కంటెంట్ ఆధారంగా వివిధ రకాల ఆడియోలను అందించే ఈక్యూ మోడ్‌లను కూడా కలిగి ఉంది. బ్లూటూత్ ఛానెల్ 5.1తో మంచి కనెక్టివిటీని అందిస్తుంది. మివీ సౌండ్‌బార్ ధర రూ. 10,998.

జీబ్రానిక్స్ జెబ్ – జూక్ బార్ ప్రో

జీబ్రానిక్స్ సౌండ్ బార్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటోంది. దీనిలో 6.5 అంగుళాల సబ్‌ వూఫర్‌, రెండు వెనుక శాటిలైట్ స్పీకర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ధ్వనిని అత్యంగా స్పష్టంగా వినగలిగే అవకాశం ఉంది. ఎల్ ఈడీ డిస్‌ప్లే కారణంగా వివిధ మోడ్ లను చాలా సులభంగా ఆపరేట్ చేసుకోవచ్చు. డాల్బీ ఆడియోతో, ఆర్జీబీ లైట్ సిస్టమ్‌తో ఆకట్టుకుంటోంది. జెబ్రోనిక్స్ సౌండ్‌బార్ ధర రూ. 9,999.

గోవో గోసరౌండ్ సౌండ్‌బార్

ఈ సౌండ్ బార్ ను అత్యంత తక్కువ ధరకు దక్కించుకోవచ్చు. ఫిప్ కార్ట్ సేల్ లో దాదాపు 75 శాతం డిస్కౌంట్ ఇచ్చారు. 5.3 బ్లూటూత్ వెర్షన్, పది మీటర్ల పెద్ద బ్లూటూత్ శ్రేణితో ఈ సౌండ్ సిస్టమ్ అద్భుతమైన ఆడియోను అందిస్తుంది. బ్లూటూత్, హెచ్ డీఎంఐ, ఏయూఎక్స్, యూఎస్బీ, ఓపీటీ ద్వారా చాలా సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సౌండ్ సిస్టమ్ లో మూడు విభిన్న ఈక్వలైజర్ మోడ్‌లు ఏర్పాటు చేశారు. కీ ప్యానెల్ ద్వారా వినియోగదారులు సులభంగా నియంత్రణ చేసుకోవచ్చు. గోవో సౌండ్ బార్ రూ. 3,999కు అందుబాటులో లభిస్తోంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి