AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: మీ ఫోన్‌కు కేంద్రం పంపిన బీప్ సౌండ్ రాలేదా..? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేసుకుంటే సేఫ్..

దేశవ్యాప్తంగా ఉన్న అందరి మొబైల్స్‌కు శనివారం కేంద్ర ప్రభుత్వం బీప్ శబ్దంతో కూడిన అలర్ట్ మెస్సేజ్‌లు పంపిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఫోన్లు ఈ మెస్సేజ్ రాలేదు. దీంతో తమకు ఎందుకు రాలేదని చాలామంది చర్చించుకుంటున్నారు. అలాంటివారు ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవాలి.

Central Government: మీ ఫోన్‌కు కేంద్రం పంపిన బీప్ సౌండ్ రాలేదా..? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేసుకుంటే సేఫ్..
Alert
Venkatrao Lella
|

Updated on: May 03, 2026 | 7:34 AM

Share

శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులందరికీ అలర్ట్ మెస్సేజ్‌లు పంపింది. ఏవైనా విపత్తులు చోటుచేసుకునే సమయంలో ప్రజలను అలర్ట్ చేసే విధానాన్ని దేశవ్యాప్తంగా టెస్టింగ్ చేసింది. దీంతో శనివారం అందరి మొబైల్స్‌కు బీప్ అనే శబ్దంతో కూడిన అలర్ట్ మెస్సేజ్ వచ్చింది. 10 సెకన్ల పాటు బీప్ శబ్దం కొనసాగగా.. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తం చేసేందుకు ఈ కొత్త విధానం తీసుకురానున్నట్లు తెలిపింది. సెల్ బ్రాడ్‌కాస్ట్ మెస్సేజింగ్ సిస్టమ్ ద్వారా కేంద్ర టెలికాం విభాగం ఈ మెస్సేజ్‌లు పంపింది. అయితే కొంతమంది ఫోన్లలో ఈ మెస్సేజ్ రాలేదు. దీనికి కారణం ఎమర్జెన్సీ అలర్ట్స్ ఆఫ్ చేసుకోకవడమే. దీనిని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి? అనేది చూద్దాం.

మీ ఫోన్‌లో ఇలా చేయండి..

మీ ఫోన్‌కు కేంద్రం పంపిన అలర్ట్ మేస్సేజ్ రాలేదంటే.. మీరు వైర్ లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ సెట్టింగ్‌ను ఆఫ్ చేసుకున్నారని అర్థం. దీనిని మీరు ఎనేబుల్ చేసుకోవడం వల్ల విపత్తుల సమయంలో అలర్ట్ మెస్సేజ్‌లు వస్తాయి. దీంతో ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. వరదలు, వర్షాలు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో మీకు ముందుగానే సమాచారం తెలియాలంటే ఈ సెట్టింగ్ చాలా ఉపయోగపడుతుంది. దీంతో ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఆన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవడం వల్ల వైర్‌లెస్‌గా ప్రసారం చేయబడిన అలర్ట్స్‌ను నేరుగా మీరు వినవచ్చు. ఎస్‌ఎంఎస్ అలర్ట్స్‌కు పూర్తి భిన్నంగా ఈ ఫీచర్ అనేది ఉంటుంది. సెల్ బ్రాడ్‌కాస్ట్ టెక్నాలజీ ద్వారా మొబైల్ టవర్ల పరిధిలో లేదా ఒక నిర్దిష్ట ప్రాంతం పరిధిలోని మొబైల్స్‌కు ఎమర్జెన్సీ సందేశం పంపవచ్చు. నెట్ వర్క్ సిగ్నల్స్ తక్కువగా ఉన్న సమయంలో కూడా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఫోన్ సైలెంట్‌లో ఉన్నా కూడా బీప్ సౌండ్ వినిపిస్తుంది. దీనికి ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేద. ఉచితంగానే ఈ ఫీచర్‌ను మీ ఫోన్‌లో సెట్టింగ్ ద్వారా ఎవరైనా ఆన్ చేసుకోవచ్చు.

సెట్టింగ్ ఎలా ఆన్ చేసుకోవాలి..?

-ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి

-సేఫ్టీ, ఎమర్జెన్సీ అనే ఆప్షన్ ఎంచుకోండి

-వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-అలర్ట్స్‌ అనుమతించపై క్లిక్ చేయండి

Follow Us
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్