AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishab Shetty: అమిత్‌షాను కలిసిన ‘కాంతారా’ హీరో రిషబ్ శెట్టి.. ఫొటోస్ వైరల్.. విషయమేమిటంటే?

ప్రముఖ కన్నడ సినీ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశాడు. తమ ఇద్దరి భేటీకి సంబంధించిన ఫొటోలను స్వయంగా రిషబ్ శెట్టి నే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్లుండి రిషబ్ అమిత్ షాతో సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది.

Rishab Shetty: అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. ఫొటోస్ వైరల్.. విషయమేమిటంటే?
Rishab Shetty, Amit Shah
Basha Shek
|

Updated on: May 03, 2026 | 7:30 AM

Share

కన్నడ సినిమా ఇంస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. శనివారం (మే03) ఢిల్లీ వెళ్లిన రిషబ్ అమిత్‌ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. అమిత్ షాతో తన భేటీకి సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు కాంతారా హీరో.. ‘గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అదృష్టం నాకు దక్కింది. ఆయన ‘కాంతార’, ‘కాంతార చాప్టర్ 1′ చిత్రాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసలు కురిపించారు. అది నా జీవితంలో అత్యంత గుర్తుండిపోయే క్షణాలలో ఒకటి. అలాగే నా రాబోయే చిత్రాల గురించి అడిగారు. ఆయనకు మన చరిత్ర, సంస్కృతి, కళ, సినిమా నిర్మాణంపై లోతైన జ్ఞానం, అవగాహన ఉన్నాయి. ఈ విషయాలపై మేమిద్దరం చాలా సేపు చర్చించున్నాం. అమిత్ షాను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు రిషబ్. ప్రస్తుతం వీరి భేటీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానలు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

కాగా 2023లో రిషబ్ శెట్టి ప్రధానమంత్రి మోదీని కూడా కలిశారు. మోదీ కర్ణాటకకు వచ్చినప్పుడు, యశ్, రిషబ్ శెట్టి ప్రత్యేకంగా ప్రధానిని కలిశారు. ఆ సమయంలో మోదీ పర్యటన గురించి నటుడు రిషబ్ శెట్టి ఇలా అన్నారు, ‘నేను ప్రధానమంత్రి మోదీని ఒక గొప్ప నాయకుడిగా భావిస్తాను. ఆయనను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కన్నడ చిత్ర పరిశ్రమ గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే కాంతారా సినిమాను ప్రత్యేకంగా ప్రశంసించారు’ అని అన్నారు. కాగా రిషబ్ శెట్టికి సినీ పరిశ్రమతోనే కాకుండా పలువురు రాజకీయ నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోరిషబ్ శెట్టి అమిత్ షాతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

అమిత్ షాతో రిషబ్ శెట్టి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..