
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ అనేది జీవితంలో ఓ భాగం అయిపోయింది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు సరికొత్త స్మార్ట్ ఫోన్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం విషయానికి వస్తే సామ్‌సంగ్ కంపెనీ ఫోన్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇక్కడ ఇటీవలే లాంచ్ చేసిన 5 జీ సర్వీసులు చాలా మంది ఇష్టపడుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలకు ఇంకా 5 జీ సర్వీసులు విస్తరించలేదు. అక్కడ ఇంకా 4 జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ మార్కెట్ టార్గెట్‌గా సామ్‌సంగ్ భారతదేశంలో కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కొత్తగా ప్రారంభించిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 14 4 జీ ఫోన్‌ను లాంచి చేసింది. కొత్తగా ప్రారంభించిన 4జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్ పరిశీలిస్తే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 25 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు వంటివి ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్ ఎం 14 4జీ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
సామ్‌సంగ్ ఎం 14 4జీ ఫోన్ రెండు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. ఆర్కిటిక్ బ్లూ, సఫైర్ బ్లూ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ల3 స్మార్ట్‌ఫోన్ రెండు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. 4 జీబీ + 64 జీబీ వేరియంట్ రూ. 8,499కు, 6 జీబీ + 128 జీబీ వేరియంట్ రూ.11,499కు అందుబాటులో ఉంది. సామ్‌సంగ్ ఎం 14 4జీ అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి