Budget Friendly Laptops: ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ.. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్న టాప్ ల్యాప్ టాప్స్ ఇవే..!

మధ్య తరగతి వారికి సాయపడేలా బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్ టాప్స్ ను కొన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. వీటిని రెండు రకాలుగా విభజించాం. రూ.50,000 లోపు, రూ.40,000 లోపు ఉన్న ల్యాప్ టాప్స్ సెలెక్ట్ చేశాం.

Budget Friendly Laptops: ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ.. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్న టాప్ ల్యాప్ టాప్స్ ఇవే..!
Laptop Market Delhi
Follow us

|

Updated on: Feb 05, 2023 | 1:12 PM

ప్రస్తుతం ప్రతి చిన్న అవసరానికి ఫోన్ ఎంత ఉపయోగపడుతుందో? ల్యాప్ టాప్ కూడా అంతే ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది. ఈ నేపథ్యలో ప్రతి ఉద్యోగస్తుడికి ల్యాప్ టాప్ ఉండడం తప్పనిసరైంది. అలాగే విద్యార్థులకు కూడా ఆన్ లైన్ క్లాసులు ఉండడంతో ల్యాప్ టాప్ అవసరం మరింత పెరిగింది. అయితే అవసరం ఎంత ఉన్నా ల్యాప్ టాప్ రేట్లు అందుబాటులో ఉండడం లేదని సగటు మధ్య తరగతి వాళ్ల బాధ. ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టినా అందుబాటులో ఉన్న టెక్నాలజీ నేపథ్యంలో మంచి ల్యాప్ ట్యాప్ ఏదో తెలుసుకోవాలంటే శక్తికి మించిన పని అవుతుందని ఆవేదన చెందుతున్నారు. మధ్య తరగతి వారికి సాయపడేలా బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్ టాప్స్ ను కొన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. వీటిని రెండు రకాలుగా విభజించాం. రూ.50,000 లోపు, రూ.40,000 లోపు ఉన్న ల్యాప్ టాప్స్ సెలెక్ట్ చేశాం. స్టాండర్డ్ కంపెనీల ల్యాప్ టాప్స్ లో తక్కువ ధర మాత్రమే కాకుండా అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉంటాయి. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

రూ.50,000 లోపు ఉత్తమ ల్యాప్ టాప్స్ ఇవే..

అసస్ వివో బుక్ 14: ఐ5 ప్రాసెసర్, 14 అంగుళాల స్క్రీన్ తో వస్తున్న ఈ ల్యాప్ టాప్ ఆకట్టుకునే విధంగా ఉంది. లైట్ వెయిట్ తో 8 జీబీ ర్యామ్ తో వచ్చే ఈ ల్యాప్ టాప్ ఇటు ఉద్యోగస్తులకు అటు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. దీని ధర రూ.49,490

హానర్ మ్యాజిక్ బుక్ 14 : బ్యాక్ లిట్ కీ బోర్డుతో వచ్చే ఈ ల్యాప్ టాప్ రాత్రి సమయంలో పని చేసుకునే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మేటల్ బాడీ, యాంటీ గ్లేర్ స్క్రీన్ ఈ ల్యాప్ ప్రత్యేకత. దీని ధర రూ.44,490

ఇవి కూడా చదవండి

హెచ్ పీ 15 ఎస్ : ఈ ల్యాప్ టాప్ లో ఉండే పవర్ ప్యాక్డ్ ఫీచర్లు, డిజైన్ ఆకట్టుకుంటుంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు, అలాగే పని చేస్తున్నప్పడు కూడా ఈ ల్యాప్ టాప్ బాగా పని చేస్తుంది. కేవలం కేజీ 600 గ్రాముల లైట్ వెయిట్ తో ఈ ల్యాప్ టాప్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇందులో ఉండే డ్యుయల్ స్పీకర్లు మంచి సౌండ్ అనుభూతినిస్తాయి. దీని ధర రూ.44,490.

రూ.40,000 లోపు ఉండే ల్యాప్ టాప్ లు ఇవే

లెనోవో ఐడియల్ ప్యాడ్ స్లిమ్ 3: ఈ ల్యాప్ సింపుల్ డిస్ ప్లే తో పాటు బ్లూటూత్, వైఫై కనెక్టవిటీతో వస్తుంది. అలాగే 6 గంటల బ్యాటరీ ప్యాకప్ తో పాటు ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ తో వస్తుంది. అలాగే ఓ గంటలో 80 శాతం పైగా చార్జ్ అవ్వడం దీని ప్రత్యేకత. ఈ ల్యాప్ టాప్ ధర రూ.33,990.

అసస్ వివో బుక్ 15 (2021) : సన్నగా, తేలికగా ఉండే ఈ ల్యాప్ టాప్ సింపుల్ ఆఫీస్ వర్క్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది. 1366X768 స్క్రీన్ రిజుల్యూషన్ తో వచ్చే ఈ ల్యాప్ టాప్ బ్యాక్ లీట్ కీ బోర్డుతో వస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చే ఈ ల్యాప్ టాప్ ధర రూ.25,990.

డెల్ ఇన్ స్పిరాన్ 3521 : డెల్ నుంచి వచ్చే ఈ అద్భుతమైన ల్యాప్ టాప్ 15.6 అంగుళాల స్క్రీన్ తో వస్తుంది. వైఫై, బ్లూటూత్ తో సులభంగా కనెక్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే నాలుగు గంట బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. దీని ధర రూ.31,374. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..