AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kawasaki Bikes: కవాసాకీ బైక్స్ పై భారీ తగ్గింపు.. ఆ మూడు మోడల్స్ పై మాత్రమే..!

అన్ని బైక్స్ పై కాకుండా కేవలం సెలెక్ట్ చేసిన మూడు మోడల్స్ పై మాత్రమే తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపు కూడా ఫిబ్రవరి 28 వరకూ మాత్రమే అందుబాటులో ఉండనుంది.

Kawasaki Bikes: కవాసాకీ బైక్స్ పై భారీ తగ్గింపు.. ఆ మూడు మోడల్స్ పై మాత్రమే..!
Kawasaki Bikes
Nikhil
|

Updated on: Feb 05, 2023 | 1:56 PM

Share

తమ బైక్ మోడ్సల్ తో యువత మనస్సు గెలుచుకున్న కవాసాకీ కంపెనీ తన బైక్స్ పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తుంది. కవాసకీ తమ బైక్ తయారీలో తన ప్రత్యేకతను ఎప్పుడూ చాటుకుంటూ ఉంటుంది.  ఎన్ని బైక్స్ పోటీలో ఉన్నా తన స్థిరమైన మార్కెట్ తో ప్రత్యర్థులకు ఎప్పుడూ సవాల్ విసురుతూనే ఉంటుంది. కొత్త ఏడాదిలో పెద్దగా తన బైక్స్ పై తగ్గింపును ప్రకటించలేదు. దాంతో పాటు మార్కెట్ లో ఎలక్ట్రిక్ బైక్స్ హవా కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కవాసాకీ కంపెనీ ఆలోచనలో పడి తగ్గింపును ఆఫర్ చేస్తుంది. అయితే అన్ని బైక్స్ పై కాకుండా కేవలం సెలెక్ట్ చేసిన మూడు మోడల్స్ పై మాత్రమే తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపు కూడా ఫిబ్రవరి 28 వరకూ మాత్రమే అందుబాటులో ఉండనుంది. కంపెనీ ఆఫర్ ప్రకటించే ఆ మూడు మోడల్స్ బైక్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

కవాసాకీ డబ్ల్యూ 800

డబ్ల్యూ 800 నియో రెట్రో మోటర్ సైకిల్. ఈ మోడల్ పై కంపెనీ దాదాపు రూ.2 లక్షల తగ్గింపును ఆఫర్ చేస్తుంది. రూ.7.33 లక్షల ఉన్న ఈ బైక్ ప్రస్తుతం రూ.5.33 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. డబుల్ సిలిండర్లతో పాటు ఎయిర్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ వర్టికల్ ట్విన్ 773 సీసీ ఇంజిన్ తో ఇది వినియోగదారులను ఆకట్టుకుంది. 14 లీటర్ల ఇంధన సామర్థ్యంతో వస్తున్న ఈ బైక్ లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తో పాట బ్యాక్ డ్రమ్ బ్రేక్ వస్తుంది.

నింజా 300

కవాసాకీ భారతీయ లైనప్ లో ఎక్కువ కాలం నడుస్తున్న నింజా లైనప్ లో నింజా 300 పై రూ.15000 తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తుంది. రూ.3.40 లక్షలున్న బైక్ ఇప్పుడు రూ.3.25 లక్షలకే అందుబాటు ఉంది. 296 సీసీ ఇంజిన్ తో డబుల్ డిస్క్ బ్రేక్ తో వచ్చే ఈ బైక్ ను యువత ఎక్కువగా ఇష్టపడుతుంది. 

ఇవి కూడా చదవండి

జెడ్ 650, జెడ్ 650 ఆర్ఎస్

జెడ్ 650, జెడ్ 650 ఆర్ఎస్ బైక్ ధరలను కంపెనీ రూ.50,000 వరకూ తగ్గించింది. జెడ్ 650 ఇప్పుడు రూ.5.93 లక్షలకు అందుబాటులో ఉంటే జెడ్ 650 ఆర్ఎస్ రూ.6.42 లక్షలకు అందుబాటు ఉంది. ఈ రెండు బైక్స్ లో 649 సీసీ ఇంజిన్ తో పాటు డబుల్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. డబుల్ సిలిండర్లతో లిక్విడ్ కూల్ ఇంజిన్ ఈ బైక్స్ ప్రత్యేకత.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!