AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme 10 Pro: త్వరలో రియల్ మీ 10 ప్రోలో కోక్ ఎడిషన్.. డిజైన్ అదిరిపోయిందిగా..!

10 ప్రో కోకో ఎడిషన్ వెనుక వైపు మ్యాట్ బ్యాక్ ఫినిషింగ్ తో కోకో కోలా లోగోతో ఆకట్టుకునే విధంగా ఉంది. అలాగే బ్యాక్ కెమెరా రిమ్స్ కోకో కోలా కలర్ అయిన రెడ్ కలర్ ఫినిషింగ్ తో వస్తుంది.

Realme 10 Pro: త్వరలో రియల్ మీ 10 ప్రోలో కోక్ ఎడిషన్.. డిజైన్ అదిరిపోయిందిగా..!
Realme 10 Pro
Nikhil
|

Updated on: Feb 05, 2023 | 12:02 PM

Share

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఫోన్ 10 ప్రో కోకో కోలా ఎడిషన్ ను రిలీజ్ చేయనుంది. ఈ కోకో ఎడిషన్ ఫిబ్రవరి 10న విడుదల చేస్తామని అధికారింగా తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. 10 ప్రో కోకో ఎడిషన్ వెనుక వైపు మ్యాట్ బ్యాక్ ఫినిషింగ్ తో కోకో కోలా లోగోతో ఆకట్టుకునే విధంగా ఉంది. అలాగే బ్యాక్ కెమెరా రిమ్స్ కోకో కోలా కలర్ అయిన రెడ్ కలర్ ఫినిషింగ్ తో వస్తుంది. అలాగే ఫోన్ దిగువున రియల్ మీ బ్రాండ్ నేమ్ సిల్వర్ కలర్ తో ఆకట్టుకుంటుంది. అయితే మిగిలిన మార్పులేమి లేకుండా ప్యాకింగ్ మాత్రం సరికొత్తగా కోకో కోలా లోగో కంపెనీ రవాణా చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రియల్ మీ కోకో కోలా కంపెనీతో ప్రత్యేక ఎడిషన్ లాంచ్ చేయడం ఇదే మొదటిసారి. గతంలో ఈ కంపెనీ థోర్, లవ్ అండ్ థండర్ మూవీ కోసం ప్రత్యేక ఎడిషన్ ను లాంచ్ చేసింది. అయితే సపరేట్ గా ఓ కంపెనీ లోగోతో మొబైల్ లాంచ్ చేయడం ఇదే ప్రథమం. 

రియల్ మీ కోకో కోలా ఎడిషన్ సరికొత్త ప్యాకేజింగ్ తో కస్టమర్లకు అందించే అవకాశం ఉంది. అలాగే ఇది స్పెష్ల్ ఎడిషన్ కాబట్టి కచ్చితంగా మొబైల్స్ పరిమిత సంఖ్యలోనే లాంచ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రియల్ మీ వెబ్ సైట్ లో ఈ ప్రత్యేక సిరీస్ ఫోన్స్ ను బుక్ చేసుకోడానికి కస్టమర్లను అనుమతిస్తుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు కంపెనీ వెబ్ సైట్ లో మొబైల్ నెంబర్ ను ఇవ్వడం ద్వారా లాంచ్ ఈవెంట్ ను వీక్షించి ఫోన్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ ధర మాత్రం రూ.20,000 లోపే ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి
  • రియల్ మి 10 ప్రో స్పెషిఫికేషన్లు
  • 6.72 అంగుళాల డిస్ ప్లే తో పాటు 120 జీహెచ్ జెడ్ స్క్రీన్ రిజుల్యూషన్. 
  • స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్
  • 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ సెకండరీ కెమెరా
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 
  • 33వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • అలాగే ఇందులో చార్జింగ్ అడాప్టర్ కూడా వస్తుంది. 
  • 5 జీతో పాటు డ్యుయల్ బాండ్ వైఫై సపోర్ట్

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!