పాటలు వింటూనే చుట్టూ ఏం జరుగుతుందో వినొచ్చు..! అదిరే ఫీచర్లతో బోస్ బడ్స్
చెవిలోపల పెట్టుకునే ఇయర్‌బడ్స్‌కు భిన్నంగా ఇప్పుడు ఓపెన్ డిజైన్ ఉన్న బడ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. సంగీతం వింటూనే చుట్టూ ఉన్న వాహనాలు, వ్యక్తుల శబ్దాలను వినడం వీటితో సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో Bose తన ఓపెన్ ఇయర్‌బడ్స్ సిరీస్‌లో రెండు కొత్త మోడళ్లను తీసుకొచ్చింది. వీటిలో ఒకటి వ్యాయామ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

రన్నింగ్, జిమ్, ఇతర బహిరంగ కార్యకలాపాల సమయంలో చెవులు పూర్తిగా మూసుకుపోకుండా సంగీతం వినాలనుకునేవారికి కొత్త ఎంపిక వచ్చింది. Sport Open Earbudsలో దృఢమైన నిర్మాణంతో పాటు ఏడు గంటల బ్యాటరీ అందించారు. Ultra Open Earbuds 2nd Genలో మెరుగైన సౌండ్, స్పష్టమైన కాల్స్, కొత్త సినిమా మోడ్ ఉన్నాయి. భారత్ ధర ఇంకా వెల్లడించలేదు.
రూ.19,000 నుంచి ధర..
Sport Open Earbuds ధర రూ.19,000గా ఉంది. Ultra Open Earbuds 2nd Gen ధర రూ.28,600. అమెరికాలో అక్టోబర్ 1 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 19 నుంచి ముందస్తు బుకింగ్‌లు తీసుకుంటారు. స్పోర్ట్ మోడల్ బ్లాక్, వైట్ స్మోక్, యూకలిప్టస్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. అల్ట్రా మోడల్ బ్లాక్, వైట్ స్మోక్, చెర్రీ చాక్లెట్, ఆలివ్ గ్రీన్, స్కై పింక్ రంగుల్లో వస్తుంది. భారత్‌లో ధర, విక్రయ తేదీని సంస్థ ఇంకా ప్రకటించలేదు.
స్పోర్ట్ మోడల్‌లో ప్రత్యేకతలు
Sport Open Earbudsలో కస్టమ్ డైనమిక్ డ్రైవర్లు, Bose ఓపెన్ ఆడియో టెక్నాలజీ ఉన్నాయి. బయట శబ్దం మారినప్పుడు ధ్వని స్థాయిని ఆటోమేటిక్‌గా మార్చే ఆటో వాల్యూమ్ సదుపాయం ఉంది. భౌతిక బటన్లతో పాటలు, కాల్స్, వాల్యూమ్‌ను నియంత్రించవచ్చు. స్పష్టమైన కాల్స్ కోసం స్పీచ్ క్లారిటీ ఫీచర్ కూడా ఉంది. IP54 రేటింగ్ కారణంగా చెమట, నీటి చినుకులు, దుమ్మును తట్టుకునేలా రూపొందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏడు గంటల వరకు పనిచేస్తాయి. కేస్‌తో మరో 22 గంటల బ్యాకప్ లభిస్తుంది.
Ultra Open 2nd Genలో కొత్త డ్రైవర్‌ను ఉపయోగించారు. దీని వల్ల బాస్, ధ్వని స్థాయి మెరుగయ్యాయని సంస్థ చెబుతోంది. ఆటో వాల్యూమ్, స్పీచ్ క్లారిటీతో పాటు TrueSpatial ఆధారిత సినిమా మోడ్ ఉంది. వీడియోలు, పాడ్‌కాస్ట్‌లు చూస్తున్నప్పుడు ధ్వనిని విస్తృతంగా వినిపిస్తూ మాటలు స్పష్టంగా వినిపించేలా ఇది పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే తొమ్మిది గంటలు, కేస్‌తో కలిపి మరో 19.5 గంటల బ్యాకప్ వస్తుంది. రెండు మోడళ్లలో Bluetooth 5.4, రెండు పరికరాల మల్టీపాయింట్ కనెక్షన్, SBC, AAC కోడెక్స్, Google Fast Pair ఉన్నాయి. అల్ట్రా మోడల్‌లో అనుకూల Android ఫోన్లకు Snapdragon Sound, aptX Adaptive సపోర్ట్ కూడా ఉంది. భారత్‌లో అధికారిక ధర, విక్రయ తేదీ వెల్లడైన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయి.
