AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తక్కువ వేరియంట్‌లోనే అదిరిపోయే మార్పులు! కియా క్యారెన్స్ క్లావిస్ లో మార్పులు తెలిస్తే షాకే

కుటుంబ అవసరాలకు సరిపోయే ప్రీమియం ఎమ్‌పీవీ కోసం చూస్తున్నవారికి కియా నుంచి కొత్త ఎంపికలు వచ్చాయి. Carens Clavis ఆటోమేటిక్ వేరియంట్ శ్రేణిని కంపెనీ పెంచింది. ఇప్పటివరకు ఎక్కువ ధర ఉన్న వేరియంట్లలో లభించిన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను తక్కువ స్థాయి వేరియంట్లలోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో కొనుగోలుదారులకు మరిన్ని అవకాశాలు లభించాయి.

తక్కువ వేరియంట్‌లోనే అదిరిపోయే మార్పులు! కియా క్యారెన్స్ క్లావిస్ లో మార్పులు తెలిస్తే షాకే
Kia Carens Clavis Automatic.jpg
Nikhil
|

Updated on: Sep 21, 2026 | 6:05 AM

Share

కారు కొనుగోలు సమయంలో గేర్‌బాక్స్ ఎంపికకు ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా నగరాల్లో తరచూ డ్రైవ్ చేసే వారికి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని Carens Clavisలో కొత్త ఆటోమేటిక్ వేరియంట్లను తీసుకొచ్చారు. టర్బో-పెట్రోల్‌తో DCT, డీజిల్‌తో ఆటోమేటిక్ ఎంపికలను అందిస్తున్నారు.

ఆటోమేటిక్ ఎంపిక

టర్బో-పెట్రోల్ వేరియంట్లలో 1.5-లీటర్ T-GDi ఇంజిన్‌ను అందిస్తున్నారు. దీనికి 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు. మరోవైపు డీజిల్ వేరియంట్‌లో 1.5-లీటర్ CRDi ఇంజిన్‌తో 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుంది. కొత్త వేరియంట్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు రోజువారీ వినియోగానికి ఉపయోగపడే కొన్ని సదుపాయాలను కూడా ఇచ్చారు. స్మార్ట్ కీ, పుష్-బటన్ స్టార్ట్, మోషన్ సెన్సర్, డ్రైవ్ మోడ్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

12.5 అంగుళాల క్లస్టర్‌తో HTE (O)

HTE (O) వేరియంట్‌లో 12.5-అంగుళాల LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ కూడా లభిస్తుంది. ఆటోమేటిక్ వెర్షన్లలో స్మార్ట్ కీ, పుష్-బటన్ స్టార్ట్, డ్రైవ్ మోడ్ వంటి సదుపాయాలు అందించారు. కొత్త వేరియంట్లలో 7-సీటర్ లేఅవుట్ కొనసాగుతోంది. ప్రధాన డిజైన్, మెకానికల్ సెటప్‌లో పెద్ద మార్పులు చేయలేదు. ధరల విషయానికి వస్తే HTE (O) టర్బో-పెట్రోల్ DCT ధర రూ.14.67 లక్షలు (ఎక్స్-షోరూమ్). HTE (EX) టర్బో-పెట్రోల్ DCT ధర రూ.15.22 లక్షలు. HTE (O) డీజిల్ ఆటోమేటిక్ ధర రూ.15.82 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్త వేరియంట్లతో తక్కువ ధర స్థాయిలోనే ఆటోమేటిక్ ఎంపిక అందుబాటులోకి వచ్చింది.

Follow Us