
ఇస్రో.. ఒకప్పుడు సైకిల్‌పై రాకెట్‌ను తీసుకెళ్లి ప్రయోగాలను చేపట్టింది.. అంతరిక్ష ప్రయోగాల్లో దిగ్గజాలు అయిన రష్యా, చైనా , అమెరికా లాంటి దేశాలు అవహేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇపుడు అదే రష్యా, అమెరికా దేశాలకు ఇస్రో కీలక ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశ పెట్టే స్థాయికి చేరుకుంది. తొలినాళ్లలో 50 కిలోలు 100 కిలోలు బరువు ఉన్న ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టి విజయాన్ని అందుకున్న ఇస్రో.. అంచలంచలుగా ఎదుగుతూ స్వదేశీ పరిజ్ఞానంతో వేల కిలోల భారీ ఉపగ్రహాలను సైతం అంతరిక్షంలోకి పంపే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది.
ఐదేళ్ల క్రితం వరకు కూడా చిన్న చిన్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించే సామర్థ్యం ఉన్న ఇస్రో.. ఇపుడు అత్యంత భారీ ఉపగ్రహాలను సైతం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే సామర్థ్యమున్న రాకెట్‌ను తయారు చేసింది. దాన్ని విజయవంతంగా నింగిలోకి పంపింది. తాజాగా బుధవారం తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగకేంద్రం నుంచి బ్లూబర్డ్‑6 బ్లాక్ 2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది ఇస్రో. ఈ ఉపగ్రహాన్ని LVM-03 M6 అనే రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది.
ఈ ఎల్‌వీఎమ్-3 M6 రాకెట్ ప్రయోగానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రాకెట్ ఇంత వరకు ఇస్రో వద్ద ఉన్న రెండు టన్నుల బరువుగల ఉపగ్రహాలను మాత్రమే నింగిలోకి పంపేది. అంతకంటే బరువైన ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలంటే ఫ్రెంచ్ గయా, రష్యా లాంటి దేశాల నుంచి ఆదేశాల సహకారం తీసుకునేది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులను అధిగమించిన ఇస్రో LVM – 03 అనే సరికొత్త వాహక నౌకను తయారు చేసింది. దీని ద్వారా 4 టన్నుల బరువు ఉన్న ఉపగ్రహాలను సైతం నింగిలోకి తీసుకెళ్లింది. ఈ రాకెట్‌కు బాహుబలి రాకెట్‌గా పేరుపెట్టింది. ఇప్పుడు అంతకు మించి అన్నట్లు LVM- 03ను మరింత అప్‌గ్రేడ్ చేసి ఏకంగా 6.1 టన్నుల బరువున్న అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టింది.
టెక్సాస్ కేంద్రంగా పనిచేసే AST స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన బ్లూబర్డ్ శ్రేణి ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా నేరుగా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవలను మెరుగ్గా అందించేందుకు ఈ బ్లూ బర్డ్ శాటిలైట్ ను రూపొందించారు. ఈ ఉపగ్రహం హై బ్యాండ్‌విడ్త్ నెట్వర్క్ అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. భూమిపై పనిచేస్తున్న మొబైల్ నెట్‌వర్క్ సేవలకు లైసెన్స్ స్పెక్ట్రమ్ ద్వారా అనుసంధానమై సేవలను విస్తరించేలా ఈ వ్యవస్థ పని చేస్తుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.