AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Fraud: ఆన్‌లైన్ ఆఫర్లంటూ మోసం.. అప్రమత్తంగా లేకుంటే అసలుకే ఎసరు.. తస్మాత్ జాగ్రత్త!

ఆన్ లైన్ పేమెంట్ ప్లాట్‌ఫాంలు ప్రకటిస్తున్న క్యాష్ బ్యాక్ లు, సబ్‌స్క్రిప్షన్ రివార్డులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని చూసి చాలామంది వాటిలో సభ్యులుగా చేరుతున్నారు. అక్కడ సూచించిన వస్తువులను షాపింగ్ చేస్తున్నారు. కానీ వారికి క్యాష్ బ్యాక్ లు, రివార్డులు రావడం లేదు. ఇలా కొన్ని ఆన్ లైన్ పేమెంట్ ప్లాట్‌ఫాంలు వినియోగదారులను మోసం చేస్తున్నాయి.

Online Fraud: ఆన్‌లైన్ ఆఫర్లంటూ మోసం.. అప్రమత్తంగా లేకుంటే అసలుకే ఎసరు.. తస్మాత్ జాగ్రత్త!
Online Fraud
Madhu
|

Updated on: Apr 12, 2024 | 5:17 PM

Share

దేశంలో డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ పద్ధతిలో చాలా సులభంగా పనులు జరుగుతున్నాయి. ఇంటి నుంచి బయటకు రాకుండానే అన్ని పనులు చేసుకునే వీలు కలిగింది. ముందుగా మనం ఆన్‌లైన్ చెల్లింపు ప్లాట్‌ఫాంలో చేరాలి. దాని ద్వారా లావాదేవీలు జరుపుకోవాలి. ఈ ప్లాట్‌ఫాంలు వివిధ రకాల డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ అందజేస్తాయి. వివిధ రకాల ఉత్పత్తులపై తగ్గింపులను, రివార్డులను అందజేస్తాయి. కానీ వీటిలో కొన్ని మోసాలు జరుగుతున్నాయని ఇటీవల సర్వేలో తెలింది.

మోసపోతున్న వినియోగదారులు..

ఆన్ లైన్ పేమెంట్ ప్లాట్‌ఫాంలు ప్రకటిస్తున్న క్యాష్ బ్యాక్ లు, సబ్‌స్క్రిప్షన్ రివార్డులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని చూసి చాలామంది వాటిలో సభ్యులుగా చేరుతున్నారు. అక్కడ సూచించిన వస్తువులను షాపింగ్ చేస్తున్నారు. కానీ వారికి క్యాష్ బ్యాక్ లు, రివార్డులు రావడం లేదు. ఇలా కొన్ని ఆన్ లైన్ పేమెంట్ ప్లాట్‌ఫాంలు వినియోగదారులను మోసం చేస్తున్నాయని తెలిసింది. ఆన్‌లైన్ చెల్లింపు ప్లాట్‌ఫాంలు అందించే క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతున్నారు. క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను చూసిన తర్వాత నిర్దిష్ట ఉత్పత్తిని కొనుగోలు చేస్తున్నారు. కానీ దానిపై ప్రకటించిన క్యాష్ బ్యాక్ వారికి అందడం లేదని ఇటీవలి సర్వేలో వెల్లడైంది.

13 రకాల పద్ధతులు..

సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీపీపీఏ) 13 రకాల తప్పుదారి పట్టించే ప్రకటనలు, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించే అన్యాయమైన వాణిజ్య పద్ధతులను వెల్లడించింది. వీటిలో హిడెన్ చార్జీలు, సబ్‌స్క్రిప్షన్ క్యాష్ బ్యాక్‌లు, పాల్స్ అర్జెన్సీ, బాస్కెట్ స్నీకింగ్, కన్ఫర్మ్ షేమింగ్, ఫోర్స్డ్ యాక్షన్, సబ్‌స్క్రిప్షన్ ట్రాప్, ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫరెన్స్, డ్రిప్ ప్రైసింగ్, ట్రిక్ ప్రశ్నలు తదితర విధానాలు ఉన్నట్టు తెలిపింది. వీటి ద్వారా పలువురు వినియోగదారులు మోస పోతున్నట్టు వెల్లడించింది.

సర్వేలో పలు విషయాలు వెల్లడి..

దీనికి సంబంధించి ఇటీవల నిర్వహించిన సర్వేలో దాదాపు 45 వేల మంది తమ అభిప్రాయాలను తెలిపారు. హిడెన్ చార్జీలకు సంబంధించి 52 శాతం మంది సమస్యలు ఎదుర్కొన్నారు. 67 శాతం మంది సబ్‌స్క్రిప్షన్ ట్రాప్‌ లో పడ్డారు. ఇక మరో మోసపూరిక బైట్ అండ్ స్విచ్ సమస్యను దాదాపు 62 శాతం మంది ఎదుర్కొన్నారు. ఇందులో వినియోగదారులకు అదనపు చెల్లింపులు చేయడం కోసం తరచుగా క్యాష్‌బ్యాక్ పథకాలు అందిస్తారు కానీ ప్రోత్సాహకం ఎప్పుడూ చెల్లించరు.

చట్టవిరుద్ధం..

వినియోగదారులను మోసం చేసే ఈ పద్ధతులు చట్టవిరుద్ధమని 2023 డిసెంబర్ లో భారత ప్రభుత్వం తెలిపింది. ఈ చీకటి పద్ధతుల ద్వారా కస్టమర్ల ను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫాంలపై రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే