AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Features: ఫొటో ప్రియులకు గూగుల్ గుడ్ న్యూస్.. ఏఐ సపోర్ట్‌తో అందుబాటులోకి సరికొత్త ఎడిటింగ్ ఫీచర్

గతంలో పిక్సెల్ ఫోన్‌లతో పాటు గూగుల్ వన్ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్న ప్రత్యేకమైన అనేక అధునాతన ఎడిటింగ్ ఎంపికలు మే 15 నుంచి దాదాపు అందరు గూగుల్ ఫోటోల వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. ఈ ఫీచర్‌లలో ఏఐ ఆధారిత మ్యాజిక్ ఎడిటర్, మ్యాజిక్ ఎరేజర్ వంటి ఇతర ఫీచర్స్‌ను పొందవచ్చు. ముఖ్యంగా ఫోటో అస్పష్టత, పోర్ట్రెయిట్ లైట్ వంటి ఫీచర్లను ఉచితంగా వాడుకోవచ్చు. 

Google Features: ఫొటో ప్రియులకు గూగుల్ గుడ్ న్యూస్.. ఏఐ సపోర్ట్‌తో అందుబాటులోకి సరికొత్త ఎడిటింగ్ ఫీచర్
Google Ai Photo Editing
Nikhil
|

Updated on: Apr 12, 2024 | 5:00 PM

Share

గూగుల్ ఎట్టకేలకు అర్హత కలిగిన స్మార్ట్‌ఫోన్‌లకు ఏఐ ఆధారిత ఎడిటింగ్ ఫీచర్‌లను ఉచితంగా అందిస్తోంది. గతంలో పిక్సెల్ ఫోన్‌లతో పాటు గూగుల్ వన్ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్న ప్రత్యేకమైన అనేక అధునాతన ఎడిటింగ్ ఎంపికలు మే 15 నుంచి దాదాపు అందరు గూగుల్ ఫోటోల వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. ఈ ఫీచర్‌లలో ఏఐ ఆధారిత మ్యాజిక్ ఎడిటర్, మ్యాజిక్ ఎరేజర్ వంటి ఇతర ఫీచర్స్‌ను పొందవచ్చు. ముఖ్యంగా ఫోటో అస్పష్టత, పోర్ట్రెయిట్ లైట్ వంటి ఫీచర్లను ఉచితంగా వాడుకోవచ్చు.  ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ మార్కెట్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో గూగుల్ కూడా తన ఏఐ ఫోటో ఎడిటింగ్ సూట్‌ను విస్తృత ప్రేక్షకులకు ఉచితంగా అందించాలని నిర్ణయించుకుంది. అయితే ఈ ఫీచర్లను ఉచితంగా పొందాలంటే గూగుల్ కొన్ని షరత్తులను విధించింది. గూగుల్ విధించిన ఆ షరుత్తులేంటో?  ఓసారి తెలుసుకుందాం. 

గూగుల్ ఏఐ ఫొటో ఎడిటింగ్ ఫీచర్లు ఉచితమని ప్రకటించినా ఈ రోల్ అవుట్‌ను పొందాలంటే  కొన్ని షరతులు ఉన్నాయి. ఈ ఫీచర్‌లను ఉపయోగించడానికి వినియోగదారులు నిర్దిష్ట హార్డ్‌వేర్ అవసరాలను తీర్చాలి. క్రోమ్ ఓఎస్ కోసం క్రోమ్  ఓఎస్ వెర్షన్ 118 లేదా అంతకంటే ఎక్కువ లేదా కనిష్టంగా 3 జీబీ ర్యామ్‌తో క్రోమ్ బుక్ అవసరం అలాగే మొబైల్ ఫోన్స్ విషయానికి వస్తే తప్పనిసరిగా ఆండ్రాయిడ్ 8.0 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్లకు ఈ ఫీచర్లు అందుబాటలో ఉంటాయి. అయితే ఐఓఎస్ 15 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌ ఉండాలి. పిక్సెల్ టాబ్లెట్‌లు కూడా మద్దతును పొందుతాయి. మీ ఫోన్ అవసరాలకు అనుగుణంగా ఉంటే ఈ సాధనాలను మే 15 నుంచి ఉచితంగా పొందవచ్చు. మరికొన్ని వారాల్లో వచ్చే గూగుల్ అప్‌డేట్ ఈ ఫీచర్లను పొందవచ్చు. 

గూగుల్ మ్యాజిక్ ఎడిటర్ ఫీచర్‌లు

అద్భుతమైన ఫీచర్లలో ఒకటైన మ్యాజిక్ ఎడిటర్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ఫోన్లతో గూగుల్ పరిచయం చేసింది. ఫోటో గ్యాప్‌లను పూరించడం, సబ్జెక్ట్‌లను రీపోజిషన్ చేయడం, ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌లను మార్చడం వంటి క్లిష్టమైన ఫోటో సవరణల కోసం ఇది ఉత్పాదక ఏఐను ఉపయోగిస్తుంది. ఈ సాధనం మ్యాజిక్ ఎరేజర్ లేదా ఫోటోషాప్ వంటి సాధనాలతో గతంలో మాన్యువల్ జోక్యం అవసరమైన పనులను ఆటోమేట్ చేస్తుంది. అప్‌డేట్‌ను అనుసరించి అన్ని పిక్సెల్ పరికరాలలో మ్యాజిక్ ఎడిటర్ ఉంటుంది. అయితే ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ ప్రమాణాలకు అనుగుణంగా నెలవారీ 10 మ్యాజిక్ ఎడిటర్ ఆదాలను అందుకుంటారు. ఈ పరిమితిని మించితే కనీసం 2 టీబీ స్టోరేజ్‌తో కూడిన ప్రీమియం గూగుల్ వన్ ప్లాన్ అవసరం అవుతుంది. 

ఇవి కూడా చదవండి

మ్యాజిక్ ఎరేజర్‌లు మాత్రమే కాకుండా గూగుల్ ఫోటోల్లో మరిన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ఫోటోల వినియోగదారులందరూ మ్యాజిక్ ఎరేజర్, ఫోటో అన్‌బ్లర్, స్కై సూచనలు, కలర్ పాప్, హెచ్‌డీఆర్ ఎఫెక్ట్‌లు, పోర్ట్రెయిట్ బ్లర్, పోర్ట్రెయిట్ లైట్, సినిమాటిక్ ఫోటోలు, కోల్లెజ్ ఎడిటర్ స్టైల్స్, వీడియో ఎఫెక్ట్‌లతో సహా పూర్తి స్థాయి ఫీచర్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..