MOTOROLA G04: రూ. 6వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. మోటో ఫోన్‌పై భారీ డిస్కౌంట్..
స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే ప్రముఖ ఈ కామర్స్ సైతం స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మోటోరోలో స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మోటోరోలో జీ04 స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌ను...
స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే ప్రముఖ ఈ కామర్స్ సైతం స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మోటోరోలో స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మోటోరోలో జీ04 స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకి ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఎంత డిస్కౌంట్ లభిస్తోంది లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మోటోరోలా జీ04 స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6,999గా ఉండగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 6,999కి సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌ను ఎస్‌బీఐ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 5999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఇక్కడితో ఆగిపోలేదు. మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 6,450 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇది మీ పాత ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఇక మోటోరోలా జీ04 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌లో ఇంటర్నల్ మెమోరీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌లో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, 5 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. Unisoc T606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..