Flipkart sales: ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై సూపర్ ఆఫర్లు! అస్సలు మిస్ చేసుకోవద్దు!

ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లలో ఫెస్టివల్ సేల్స్ నడుస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ పై ఈ సేల్స్ లో మంచి ఆఫర్లు లభిస్తుంటాయి. అందుకే మొబైల్స్ కొనడానికి ఇదే మంచి టైం. ముఖ్యంగా ఫ్లాగ్ షిప్ ఫోన్స్ కొనాలనుకునే వారు తప్పకుండా ఈ సేల్ లోని డీల్స్ పై ఓలుక్కేయాలి. ఎందుకంటే..

Flipkart sales: ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై సూపర్ ఆఫర్లు! అస్సలు మిస్ చేసుకోవద్దు!
Flipkart Sales Flag Ship Mobile

Updated on: Sep 26, 2025 | 6:31 PM

ఫెస్టివల్  సేల్స్‌లో అద్భుతమైన డిస్కౌంట్స్‌ నడుస్తున్నాయి. ఫ్లాగ్ షిప్ రేంజ్ ఫోన్లు కూడా ధరలు తగ్గి బడ్జెట్ ధరల్లో లభిస్తున్నాయి. అందుకే మంచి మొబైల్ కొనాలనుకునేవాళ్లు ఈ డీల్స్ ఒకసారి చెక్ చేయండి.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 24 అల్ట్రా

ప్రస్తుతం బెస్ట్ ఆఫర్ నడుస్తున్న మొబైల్ ఇదే. సుమారు రూ.  లక్షా 30 వేల ధర ఉన్న ఈ మొబైల్ సేల్ లో రూ. 72 వేలకే లభిస్తుంది. ఈ సీజన్‌లోనే అతి భారీ ఆఫర్ ఇది. ఈ ఫోన్ కొనాలనుకునేవాళ్లకు ఇదే సూపర్ ఛాన్స్. ఈ ఫోన్.. స్నాప్‌డ్రాగన్‌ 8జెన్‌ 3 ప్రాసెసర్‌తో రన్‌ అవుతుంది. 2కె డైనమిక్‌ డిస్‌ప్లే ఉంటుంది. 200 మెగా పిక్సెల్‌ మెయిన్ కెమెరాతోపాటు 12 మెగాపిక్సెల్‌ వైడ్ యాంగిల్ కెమెరా, రెండు టెలి ఫొటో లెన్స్‌లు ఉంటాయి.

శాంసంగ్‌ గెలాక్సి ఎస్‌ 24 ఎఫ్‌ఈ 

ఇంకాస్త తక్కువలో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ కోసం చూస్తున్నవాళ్లు శాంసంగ్‌ గెలాక్సి ఎస్‌ 24 ఎఫ్‌ఈ  ట్రై చేయొచ్చు. ఈ సేల్ లో ఇది రూ. 30 వేలకు లభిస్తోంది. ఒరిజినల్ ప్రైస్ అరవై వేలకుపైగానే ఉంది.  ఈ ఫోన్ ఎగ్జినోస్‌ 24400 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ ఆల్ట్రావైడ్‌, 10 ఎంపీ టెలిఫొటో లెన్స్‌ ఉన్నాయి.

ఐఫోన్స్

ఐఫోన్ కొనాలనుకునే వాళ్లకు కూడా ఇదే మంచి ఛాన్స్. ఈ సేల్ లో ఐఫోన్ 15 బ్యాంక్ డిస్కౌంట్‌తో కలిపి రూ. 43, 749 రూపాయలకు లభిస్తుంది. దీని లాంచ్‌ ధర 80వేల రూపాయలు ఉండగా ఇప్పుడు దాదాపు సగం ధరకు లభిస్తోంది. అలాగే ఐఫోన్ 16 కూడా 53వేల రూపాయలకు అందుబాటులో ఉంది.

ఇవి కూడా

ఇకపొతే ఈ సేల్ లో వన్‌ప్లస్‌ 13 ఆర్ మొబైల్.. బ్యాంక్ ఆఫర్‌త కలుపుకుని రూ. 38 వేలుకు లభిస్తుంది. ఇది స్నాప్‌ డ్రాగన్ 8జెన్ 3 ప్రాసెసర్ పై రన్ అవుతుంది.  అలాగే రూ.69,999 ఒరిజినల్ ప్రైస్ ఉన్న వన్‌ప్లస్‌ 13.. ఈ సేల్‌లో రూ.57,999కు అందుబాటులోఉంది.  రీసెంట్ గా రూ.54,999 ధరకు రిలీజైన వన్‌ప్లస్‌ 13ఎస్‌.. ఈ  సేల్‌లో రూ.47,999కు లభిస్తుంది.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..