
ఫెస్టివల్ సేల్స్‌లో మొబైల్స్, టీవీలు, హెడ్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్స్ ఇలా అన్నింటిపై టెంప్టింగ్ ఆఫర్స్ ఉన్నాయి. సాధారణంగా ఎక్కువ ధరకు లభించే గేమింగ్ ల్యాప్‌టాప్స్ కూడా ఈ సేల్ లో మంచి డిస్కౌంట్స్ కు లభిస్తున్నాయి. అలాంటి కొన్ని బెస్ట్ డీల్స్ ఇప్పుడు చూద్దాం.
గేమింగ్ ల్యాప్‌టాప్స్‌లో ఎంఎస్‌ఐ బ్రాండ్‌కు మంచి పేరుంది. అయితే ఎంఎస్‌ఐ జీఎఫ్ 63 అనే ల్యాప్‌టాప్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో సూపర్ డిస్కౌంట్ లో లభిస్తుంది. ఐ7 ప్రాసెసర్ ఉన్న ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 88,990 కాగా సేల్ లో కేవలం రూ. 46,990 కే లభిస్తుంది. ఇందులో ఎన్‌వీడియా జీటీఎక్స్ 1650 గ్రాఫిక్ కార్డు ఉంటుంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్‌ఎస్‌డీతో వస్తుంది.
లెనోవో ఎల్ఓక్యూ అనే ల్యాప్‌టాప్ ఏకంగా 24 జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఇందులో 512 జీబీ ఎస్‌ఎస్‌డీతోపాటు ఎన్‌వీడియా ఆర్టీఎక్స్ 3050 గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. ఏఎండీ రేజాన్ 5 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. దీని అసలు ధర రూ. 90,490 కాగా ఫ్లిప్‌కార్ట్ సేల్ లో రూ. 58,990 కి లభిస్తుంది.
ఏసర్ అస్పైర్ 7( Acer Aspire7) ల్యాప్‌టాప్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో మంచి డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ.84,999 కాగా సేల్‌లో 51,999 కి లభిస్తుంది. ఇది ఇంటెల్ ఐ5 ప్రాసెసర్ తో వస్తుంది. ఎన్‌వీడియా ఆర్టీఎక్స్ 3050 గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్‌ఎస్‌డీ తో వస్తుంది.
ఏసర్ బ్రాండ్ కు చెందిన మరో బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్ నైట్రో 5 అమెజాన్‌లో రూ.55,990కి అందుబాటులో ఉంది. కాగా దీని అసలు ధర రూ. 68,990. ఇది ఏఎండీ రేజాన్ 56600 హెచ్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఎన్‌వీడియా ఆర్టీఎక్స్ 3050 గ్రాఫిక్ కార్డ్‌తో వస్తుంది. 16జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్‌ఎస్‌డీతో వస్తుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి