AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PC virus: మీ కంప్యూటర్‌‌లో వైరస్ ఉందా? ఇలా చెక్ చేసి చూడండి!

ల్యాప్‌టాప్ లేదా పీసీ వాడేవాళ్లకి మాల్వేర్, వైరస్‌ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అయితే పీసీకి వైరస్ సోకినప్పుడు దాన్ని గుర్తించడం చాలా కష్టం. పైకి బాగానే పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ, లోపల డేటా అంతా హ్యాక్ అవుతుంది. అందుకే పీసీ పనితీరులో వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా గమనిస్తుండాలి. మామూలుగా వైరస్ సోకినప్పుడు ఎలాంటి మార్పులు కనిపిస్తాయంటే..

PC virus: మీ కంప్యూటర్‌‌లో వైరస్ ఉందా? ఇలా చెక్ చేసి చూడండి!
Pc Virus
Nikhil
|

Updated on: Oct 01, 2025 | 3:43 PM

Share

పీసీకి వైరస్ సోకినప్పుడు పనితీరులో కొన్ని మార్పులొస్తాయి. అయితే చాలామంది వీటిని తేలిగ్గా తీసుకుంటారు. సిస్టమ్ స్లో అయిందేమో అనుకుని వదిలేస్తారు. అయితే మాల్వేర్ ఎటాక్స్ ఎక్కువగా జరుగుతున్న ఈ రోజుల్లో ల్యాప్‌టాప్‌పై ప్రొఫెషల్ వర్క్ చేసుకునే వాళ్లు జాగ్రత్తగా ఉండడం అవసరం.

పాప్ అప్ విండోస్ వస్తుంటే..

కంప్యూటర్‌‌లో ఫోల్డర్స్ లేదా పాప్‌–అప్ విండోస్ మాటిమాటికీ క్రాష్ అవ్వడం లేదా ఆటోమేటిక్‌గా క్లోజ్ అవ్వడం గమనిస్తే.. వైరస్ సోకిందేమో చెక్ చేయాలి. ఇలా జరుగుతున్నప్పుడు వెంటనే టెక్నీషియన్ సాయం తీసుకోవాలి. లేదా యాంటీ వైరస్‌తో స్కాన్ చేయాలి. లేకపోతే హార్డ్‌ డిస్క్‌లో డేటా అంతా క్లియర్ అయిపోవచ్చు. అలాగే ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు మాటిమాటికీ పాప్‌–అప్‌లు వస్తుంటే అది యాడ్‌వేర్ వైరస్ పని అవ్వొచ్చు. ఇలాంటప్పుడు వెంటనే ఇంటర్నెట్ కనెక్షన్ ఆఫ్ చేసి.. సిస్టమ్ షట్‌డౌన్ చేయాలి. లేటెస్ట్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌‌తో పీసీని స్కాన్ చేయాలి.

నో యాక్సెస్ అని చూపిస్తుంటే..

సిస్టమ్‌లోని ఇన్‌బిల్ట్ సాఫ్ట్‌వేర్స్‌ను ఓపెన్ చేసినప్పుడు యాక్సెస్‌ లేదని డిస్‌ప్లే వస్తుంటే అది వైరస్ పని కావొచ్చు. వైరస్‌లు సిస్టమ్ ఫైల్స్‌ను ఎటాక్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు వెంటనే సిస్టమ్‌లోని డేటాను రీస్టోర్ చేసి ఫార్మాట్ చేయడం బెటర్.

ట్యాబ్స్ ఓపెన్ అవుతుంటే..

బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏవేవో వెబ్‌సైట్స్ ఓపెన్ అవుతుంటే అది ఇంటర్నెట్ ద్వారా సిస్టమ్‌లోకి ఎంటర్ అయిన బగ్ కావొచ్చు. ఇలాంటప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ చేసి పీసీని యాంటీవైరస్‌తో స్కాన్ చేయాలి.

స్పీడ్ తగ్గితే..

ఇక వీటితోపాటు పీసీ వేగం తగ్గడం, డేటా యూసేజ్ పెరగడం, స్క్రీన్ ఆటో ఆఫ్, ఆటో ఆన్ అవ్వడం లాంటివి కూడా వైరస్ వల్ల వచ్చే మార్పులే.  ఇలాంటివి గమనించినప్పుడు వెంటనే యాంటీ వైరస్‌తో సిస్టమ్‌ను స్కాన్ చేయాలి. లేదా టెక్నీషియన్‌కు చూపించాలి.

ఇలా చేస్తే సేఫ్

  • కంప్యూటర్‌‌కు వైరస్ సోకింది అనిపించినప్పుడు అందులో పర్సనల్ అకౌంట్స్‌ లాగిన్ అవ్వకుండా ఉంటే మంచిది. అలాగే హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ వంటివి కనెక్ట్ చేయకపోవడం బెటర్.
  • వైరస్‌లు ఫిషింగ్‌ మెయిల్స్ ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. కాబట్టి మెయిళ్ల ద్వారా వచ్చే లింక్స్‌ను క్లిక్ చేయకుండా జాగ్రత్తపడాలి.
  • సిస్టమ్‌లో సాఫ్ట్‌వేర్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు ట్రస్టెడ్ సోర్సెస్‌ను మాత్రమే ఎంచుకోవాలి.
  • కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో ఒరిజినల్ ఓఎస్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ‘విండోస్ డిఫెండర్ ఫైర్‌వాల్‌’ వంటి యాంటీవైరస్‌ ప్రొటెక్షన్ లభిస్తుంది. అది కుదరకపోతే ఇతర యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌‌లు కూడా వాడుకోవచ్చు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!