AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oldest Millipede: అరుదైన పురాతన జీవిని కనుగొన్న ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు.. ఆ జీవికి ఎన్ని కాళ్లు ఉన్నాయో తెలిస్తే మతి పోతుంది!

ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు 1306 కాళ్లు ఉన్న అరుదైన జీవిని కనుగొన్నారు. ఇది ఒక రకమైన మిల్లిపేడ్. ప్రపంచంలో వెయ్యికి పైగా కాళ్లు ఉన్న ఏకైక జీవి ఇది. ఇది భూమికి 200 అడుగుల దిగువన ఉన్నట్లు గుర్తించారు.

Oldest Millipede: అరుదైన పురాతన జీవిని కనుగొన్న ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు.. ఆ జీవికి ఎన్ని కాళ్లు ఉన్నాయో తెలిస్తే మతి పోతుంది!
Oldest Millipede
KVD Varma
|

Updated on: Dec 19, 2021 | 8:20 PM

Share

Oldest Millipede: ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు 1306 కాళ్లు ఉన్న అరుదైన జీవిని కనుగొన్నారు. ఇది ఒక రకమైన మిల్లిపేడ్. ప్రపంచంలో వెయ్యికి పైగా కాళ్లు ఉన్న ఏకైక జీవి ఇది. ఇది భూమికి 200 అడుగుల దిగువన ఉన్నట్లు గుర్తించారు. ఇది 95.7 మిల్లీమీటర్ల పొడవు.. యూఎస్బీ(USB) కేబుల్ లాగా సన్నగా ఉంటుంది. నిపుణులు ఈ జీవికి ‘యుమిలెప్స్ పెర్సెఫోన్’ అని పేరు పెట్టారు. ఈ జాతి 400 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఉండేది. పెర్సెఫోన్ కంటే ముందు, కాలిఫోర్నియాలో ఎక్కువ కాళ్లు ఉన్న జంతువు కనుగొన్నారు. దానికి 750 కాళ్లు ఉండేవి. అది కూడా మిల్లీపెడ్‌. దాని పేరు ఎలెక్మీ ప్లానిప్స్. ఆ జంతువు మొదటిసారి 1980లో కనిపించింది.

మిల్లిపేడ్ ఆంగ్లంలో మిల్లిపేడ్ అంటే వెయ్యి అడుగుల అని అర్థం. పూర్వ కాలంలో చాలా ఎక్కువ కాళ్ళతో ఉన్న జీవులను వెయ్యి కాళ్ళు లేకపోయినప్పటికీ వేయికాళ్ళ జంతువుగా పిలిచే వారు. అందుకే వాటికి మిల్లిపాడ్ అని పేరు పెట్టారు. అయితే, యుమిలెప్స్ పెర్సెఫోన్ 1000 లేదా అంతకంటే ఎక్కువ కాళ్ళను కలిగి ఉన్న మొదటి మిల్లిపేడ్. శాస్త్రవేత్తల ప్రకారం, పెర్సెఫోన్ అనే పదం గ్రీకు పురాణాల నుండి తీసుకున్నారు. దీని అర్ధం పాతాళానికి రాణి అని. ఈ జీవిని భూమిలో చాలా కింది నుంచి గుర్తించడంతో దీనికి ఆ పేరు పెట్టారు. మిల్లిపెడెస్‌కు భూమిలోని అనేక ఇతర జీవుల వలె కళ్ళు లేవు. వీటికి కళ్ళు ఉండవు. మిల్లిపెడెస్ ఫంగస్‌పై జీవిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని శాస్త్రవేత్తలు రెండు ఆడ, రెండు మగ మిల్లిపెడ్‌లను కనుగొన్నారు. ఆడ మిల్లీ పైడ్స్ కాళ్ల సంఖ్య 1306, 998. మగ మిల్లిపెడెస్‌కు 818, 778 కాళ్లు ఉన్నాయి. శాస్త్రవేత్తల చెబుతున్న దాని ప్రకారం, మొదట కనుగొన్న పెడ్స్ 400 మిలియన్ సంవత్సరాల క్రితం కనిపెట్టారు. ఇప్పుడు వాటి జాతుల సంఖ్య 13,000.

ఇన్ని కాళ్లు ఎందుకు? పెర్సెఫోన్ కాంతి లేదా తగినంత ఆహారం లేని ప్రపంచంలో నివసిస్తుంది. ఈ జీవి భూమికింద బతకాలంటే ఇన్ని కాళ్లు ఉండాల్సిందే అంటున్నారు శాస్త్రవేత్తలు. మిల్లీ పెడ్ యొక్క పొడవు మరియు పొట్టి కాళ్లు కదలడాన్ని సులభతరం, అనువైనవిగా చేస్తాయి. భూమి కింద దొరికే వీటికి ఆహారం లేకపోవడంతో శరీరంలోని ఇతర భాగాలు అభివృద్ధి చెందవు.

మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్