AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Android 16: మొబైల్‌ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. ఆండ్రాయిడ్‌ 16 వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?

Android 16: ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్: మీరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్‌ని ఉపయోగిస్తున్నట్లయితే, మీకు శుభవార్త ఉంది. ఫోన్ రూపాన్ని పూర్తిగా మార్చే కొత్త అప్‌డేట్ త్వరలో రావచ్చు. ప్రస్తుతం అందరికి ఆండ్రాయిడ్‌ 14 అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ 15 వెర్షన్‌ అందుబాటులో ఉంది. ఇది ఇప్పుడు అన్ని మొబైళ్లకు అందుబాటులోకి వస్తోంది. ఇక ఆండ్రాయిడ్‌ 16 కూడా రాబోతోంది..

Android 16: మొబైల్‌ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. ఆండ్రాయిడ్‌ 16 వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?
Subhash Goud
|

Updated on: Jan 20, 2025 | 12:48 PM

Share

గూగుల్ గత ఏడాది అక్టోబర్‌లో ఆండ్రాయిడ్ 15ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ వెర్షన్‌ కొన్ని ఫోన్‌లలో అప్‌డేట్‌ అయ్యింది. ఆ తర్వాత కంపెనీ ఇప్పుడు దాని తదుపరి OS అప్‌డేట్ అంటే ఆండ్రాయిడ్ 16పై పని చేస్తోంది. ఇటీవల, Google త్వరలో Android 16 మొదటి బీటా వెర్షన్‌ను విడుదల చేయవచ్చని నివేదికలు వెలువడుతున్నాయి. ఈ కొత్త అప్ డేట్ తో ఫోన్ లుక్ పూర్తిగా మారిపోతుంది. ఈ కొత్త అప్‌డేట్ ఎప్పుడు విడుదల చేయవచ్చో వెలువడుతున్న నివేదికల ద్వారా తెలుస్తోంది.

ఆండ్రాయిడ్ 16 బీటా ఎప్పుడు విడుదల అవుతుంది?

ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం, గూగుల్ త్వరలో ఆండ్రాయిడ్ 16 బీటా వెర్షన్‌ను విడుదల చేయబోతోంది. ఈ సమాచారం Android Gerritలో ఉంది. ఇక్కడ Google ఉద్యోగి రాబోయే బీటా వెర్షన్ టైమ్‌లైన్‌ను వెల్లడించారు. అప్‌డేట్‌ ఎప్పుడు విడుదల అవుతుందో చూద్దాం.

  • మొదటి బీటా వెర్షన్ జనవరి 22, 2025న విడుదల కావచ్చు.
  • రెండవ బీటా వెర్షన్ 19 ఫిబ్రవరి 2025న విడుదల కావచ్చు.
  • మూడవ బీటా వెర్షన్ మార్చి 12, 2025న విడుదల కావచ్చు.

ఆండ్రాయిడ్ 16 మార్చి మధ్య నాటికి అందరికీ అందుబాటులోకి రావచ్చని కూడా నివేదికలు సూచిస్తున్నాయి. దీని తరువాత, బీటా 4 ఏప్రిల్ లేదా మేలో విడుదల కావచ్చు. ఆండ్రాయిడ్ 16 స్థిరమైన వెర్షన్ 2025 రెండవ త్రైమాసికం చివరి నాటికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది గత సంవత్సరం ఆండ్రాయిడ్ 15 అక్టోబర్ లాంచ్‌కు చాలా ముందు.

ఈ 6 మార్పులు Android 16లో..

  1. మెరుగైన వాల్యూమ్ నియంత్రణ: కొత్త అప్‌డేట్‌తో మీరు ఆడియో సెట్టింగ్‌లపై మెరుగైన నియంత్రణను పొందుతారు.
  2. షార్ప్ UI, యాక్సెసిబిలిటీ: ఇది మాత్రమే కాదు, కొత్త అప్‌డేట్‌లో ఇంటర్‌ఫేస్ మెరుగ్గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.
  3. హెల్త్ రికార్డ్ ఇంటిగ్రేషన్: వినియోగదారుల హెల్త్‌ డేటాను నిర్వహించడానికి కొత్త ఫీచర్లు కూడా వస్తున్నాయి.
  4. మెరుగైన రిఫ్రెష్ రేట్: స్క్రీన్ పనితీరును మరింత మెరుగుపరచడానికి మొబైల్‌ రిఫ్రెష్ రేట్ కూడా మెరుగయ్యే ఫీచర్‌ ఉంటుంది.
  5. భద్రత, ప్రైవసీ: వినియోగదారుల గోప్యతను మెరుగుపరచడానికి, కంపెనీ కొత్త అప్‌డేట్‌లో అనేక భద్రతా ఫీచర్స్‌ను కూడా జోడిస్తుంది.
  6. బ్యాటరీ పనితీరు: ఇది మాత్రమే కాదు, కొత్త అప్‌డేట్‌తో మెరుగైన బ్యాటరీ పనితీరు కూడా అందుబాటులో ఉంటుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!