Amazon Sale 2023: రూ. 30 వేలలో సూపర్ స్మార్ట్ ఫోన్స్.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్
ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ సైతం సేల్‌ను ప్రకటించాయి. అక్టోబర్ 8వ తేదీ నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్స్ ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఎలక్ట్రానికి గ్యాడ్జెట్స్ నుంచి అన్ని రకాల గృహోపకరణాల వరకు భారీగా డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెజాన్ సేల్‌లో కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇంతకీ ఈ సేల్‌లో రూ. 30 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటి.?

పండుగల నేపథ్యంలో ఈ కామర్స్ సైట్స్ భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ సైతం సేల్‌ను ప్రకటించాయి. అక్టోబర్ 8వ తేదీ నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్స్ ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఎలక్ట్రానికి గ్యాడ్జెట్స్ నుంచి అన్ని రకాల గృహోపకరణాల వరకు భారీగా డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెజాన్ సేల్‌లో కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇంతకీ ఈ సేల్‌లో రూ. 30 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటి.? వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..
ఐకూ నియో7…
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023లో భాగంగా ఐకూ నియో7 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 34,999గా ఉండగా, సేల్‌లో భాగంగా రూ. 25,999కే సొంతం చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 120 వాట్స్ ఛార్జింగ్‌తో కూడిన 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్‌తో కూడిన ఈ ఫోన్‌లో డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌ను అందించారు. 120 హెచ్‌జెడ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు.
సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్20 ఎఫ్ఈ…
అమెజాన్ సేల్‌లో రూ. 30 వేలలోపు అందుబాటులోకి వస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్20 ఎఫ్‌ఈపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 12 మెగాపికెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అమెజాన్ సేలలో భాగంగా ఈ ఫోన్‌ను రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు.
టెక్నో కనన్ 20 ప్రీమియర్..
అమెజాన్ సేల్‌లో భాగంగా రూ. 30 వేలలోపు అందుబాటులో ఉంటున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో టెక్నో కనన్ 20 ప్రీమియర్ స్మార్ట్ ఫోన్ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 108 ఎంపీ రెయిర్ కెమెరాను అందించారు. ఇక సేల్‌లో భాగంగా ఈ ఫోన్ అసలు ధర రూ. 41,999కాగా, సేల్‌లో భాగంగా రూ. 27,499కి సొంతం చేసుకోవచ్చు.
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ23…
అమెజాన్ సేల్‌లో రూ. 30 వేలలోపు అందుబాటులో లభిస్తున్న స్మార్ట్ ఫోన్స్‌లో సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ23 ఫోన్ ఒకటి. ఈ ఫోన్‌లో 6.6 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ+ ఇన్ఫినిటీ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే ఈ ఫోన్ అసలు ధర రూ. 28,990కాగా సేల్‌లో భాగంగా రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు.
హానర్ 90…
అమెజాన్ సేల్‌లో అందుబాటులోకి వస్తున్న మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్ హానర్ 90. ఈ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 47,999గా ఉండగా సేల్‌లో భాగంగా రూ. 26,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ రెయిర్ కెమరాను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..