Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart TV: రూ. 44 వేలకే 65 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ సొంతం చేసుకునే అవకాశం..

అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ వెస్టింగ్‌ హౌజ్‌ కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త టీవీని లాంచ్‌ చేసింది. 'WH65GTX50' పేరుతో ఈ టీవీని తీసుకొచ్చారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. అధునాతన ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్ టీవీని తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. క్వాంటమ్‌ సిరీస్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ టీవీని ఇండియాలో లాంచ్‌ చేశారు....

Smart TV: రూ. 44 వేలకే 65 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ సొంతం చేసుకునే అవకాశం..
Smart TV
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 07, 2023 | 2:02 PM

టెక్‌ మార్కెట్లో రోజుకో కొంగొత్త స్మార్ట్‌ టీవీలు అందుబాటులోకి వస్తున్నాయి. మార్కెట్ విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ కొత్త ప్రొడక్ట్ లాంచ్‌ అయినా అన్ని దేశాల్లో లభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ టీవీలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. విదేశాల్లో లాంచ్‌ అయిన టీవీలు ప్రస్తుతం భారత మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాకు చెందిన ఓ ఎలక్ట్రానిక్‌ సంస్థ స్మార్ట్ టీవీని భారత్‌లో లాంచ్‌ చేసింది.

అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ వెస్టింగ్‌ హౌజ్‌ కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త టీవీని లాంచ్‌ చేసింది. ‘WH65GTX50’ పేరుతో ఈ టీవీని తీసుకొచ్చారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. అధునాతన ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్ టీవీని తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. క్వాంటమ్‌ సిరీస్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ టీవీని ఇండియాలో లాంచ్‌ చేశారు. 65 ఇంచెస్‌ రోజ్‌ గోల్డ్‌ టీవీని క్వాంటల్‌ సిరీస్‌లో భాగంగా ఈ టీవీని తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ టీవీ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..

ఇదిలా ఉంటే అక్టోబర్‌ 7 నుంచి ఈ స్మార్ట్‌ టీవీ అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ టీవీ రూ. 43,999కి సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 3840 x 2160 పిక్సెల్‌తో కూడిన డిస్‌ప్లే ఈ స్మార్ట్ టీవీ సొంతం. ఇక 60 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు. ఇక స్టోరేజ్‌ విషయానికొస్తే ఈ స్మార్ట్ టీవీలో 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు. ఈ స్మార్ట్ టీవీ గూగుల్‌ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఇక ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, యూట్యూబ్‌, జీ5 వంటి యాప్స్‌కు ఇన్‌బుల్ట్‌గా ఇవ్వనున్నారు.

కనెక్టివిటీ ఫీచర్స్‌ విషయానికొస్తే.. ఇందులో 3 హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్‌లు, 2 యూఎస్‌బీ పోర్టులు, ఏఎల్‌ఎల్‌ఎమ్‌, ఈఏర్‌సీ, బ్లూటూత్‌ 5.0, ఈథర్‌నెట్‌ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్ టీవీని కాంట్రాస్ట్ సూపర్‌ టెక్నాలజీ డిస్‌ప్లేతో రూపొందించారు. దీంతో అత్యంత నాణ్యమైన పిక్చర్‌ క్వాలిటీని అందించనున్నారు. ఇదిలా ఉంటే సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ టీవీపై కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన బ్యాంకులకు సంబంధించిన కార్డులతో కొనుగోలు చేస్తే మరింత డిస్కౌంట్‌ లభించనుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..