- Telugu News Technology Amazon and flipkart offering huge discount on electronic gadgets in Republic day sale 2024
Republic Day Sale: గెట్ రడీ.. ఆఫర్ల పండగ వచ్చేస్తోంది. రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా..
ఈ కామర్స్ సైట్స్ ప్రతీ ఏటా జనవరిలో రిపబ్లిక్ డే సేల్ పేరుతో ఆఫర్లు అందిస్తాయని తెలిసిందే. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రిపబ్లిక్ డే సేల్‌ను ప్రారంభించనున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ అయిన అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ సైతం రిపబ్లిక్ డే సేల్ పేరుతో ఆఫర్లను అందించనున్నట్లు ప్రకటించాయి. ఇంతకీ ఈ సేల్‌లో ఏయే ప్రొడక్ట్స్‌పై ఆఫర్లు లభించనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jan 22, 2024 | 5:38 PM

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ పేరుతో ఆఫర్లను అందించేందుకు సిద్ధమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ జనవరి 14వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు మొత్తం 6 రోజుల పాటు సేల్‌ను నిర్వహించనున్నారు.

ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీలు మొదలు ఎలక్ట్రానిక్ వస్తువులపై 50 శాతం నుంచి 80 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.

ఫ్లిప్ కార్ట్ సేల్ భాగంగా ఆపిల్, రియల్ మీ, సామ్ సంగ్, మోటోరోలా కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్లను అందించనున్నాయి. ఐ ఫోన్ 15, గూగుల్ పిక్సెల్ 7a, సామ్ సంగ్ S21 FE 5G (2023 మోడల్), మోటోరోలా ఎడ్జ్ 40 Neo, పిక్సెల్ 8 మొబైల్స్‌పై డిస్కౌంట్స్ అందించనున్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌లోనూ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను నిర్వహించనున్నారు. అమెజాన్ సేల్ జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే చివరి తేదీ ఎప్పుడనే దాని గురించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మెజాన్‌లో సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ బ్యాంకుకు చెందిన కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ అందిస్తారు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్స్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. అలాగే స్మార్ట్‌వాచ్‌లు, ట్యాబ్లెట్స్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పౌ 75 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నారు.




