- Telugu News Photo Gallery Technology photos Lenovo launches new budget tablet Lenovo m11 features and price details
Lenovo m11: తక్కువ బడ్జెట్‌లో లెనోవో కొత్త ట్యాబ్.. ఫీచర్స్ మాములుగా లేవుగా..
స్మార్ట్ ఫోన్లకు సమానంగా ట్యాబ్లెట్స్‌కి కూడా క్రేజ్ పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో దిగ్గజ ఎలక్ట్రానిక్ కంపెనీలు కొంగొత్త ట్యాబ్‌లను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో బడ్జెట్ ధరలో ట్యాబ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనొవో కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. ఈ ట్యాబ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jan 11, 2024 | 10:32 PM

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ లెనొవో మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చింది. లెనొవో ఎమ్11 పేరతుతో ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ట్యాబ్ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.

లెనొవో ఎమ్11 పేరుతో రెండు వేరియంట్స్‌లో ట్యాబ్స్‌ను లాంచ్ చేసింది. ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరనుర ఊ. 14,900గా నిర్ణయిచారు. అయితే మరో వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

ఇక ఈ ట్యాబ్‌ను ఏప్రిల్ నెల నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు లెనొవో ప్రకటించింది. ఈ ట్యాబ్‌లో రెండు ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో పాటు నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.

ఇక ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్‌లో 7,040 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో.. 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, సెల్ఫీలు.. వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.

ఈ ట్యాబ్‌లో ప్రత్యేకంగా మల్టీ టాస్కింగ్ ఫీచర్‌ను అందించనున్నారు. దీంతో ఒక పని చేస్తున్న సమయంలోనే ఇతర పనులు కూడా చేసుకోవచ్చు. ఉదాహరణకు ఏదైనా వీడియో చూస్తున్న సమయంలో నోట్స్ రాసుకోవచ్చు. ఇక ఈ ట్యాబ్‌కు పెన్ సపోర్ట్‌ను కూడా ఇవ్వనున్నారు. అయితే దీనిని ప్రత్యేంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.




