AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Smart Watch: బోట్‌తో జతకట్టిన జియో.. ఈ-సిమ్‌ సదుపాయంతో స్మార్ట్‌వాచ్‌ రిలీజ్‌..!

ఇటీవల కాలంలో యువత ఎక్కువగా బ్లూటూత్‌ సాయంతో పని చేసే స్మార్ట్‌వాచ్‌లను అమితంగా ఇష్టపడుతున్నారు. దీంతో జియో కూడా ఈ స్మార్ట్‌వాచ్‌ల మార్కెట్‌ వైపు దృష్టి సారించింది. తక్కువ ధరలకు మెరుగైన గాడ్జెట్‌లను అందించడంలో కంపెనీ పూర్తి శ్రద్ధ చూపుతోందరని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జియో ప్రముఖ స్మార్ట్‌ వాచ్‌ కంపెనీ బోట్‌ కంపెనీతో జత కట్టింది.

Jio Smart Watch: బోట్‌తో జతకట్టిన జియో..  ఈ-సిమ్‌ సదుపాయంతో స్మార్ట్‌వాచ్‌ రిలీజ్‌..!
Jio Smart Watch
Nikhil
| Edited By: Janardhan Veluru|

Updated on: Jan 12, 2024 | 1:53 PM

Share

భారతదేశంలో జియో ఉత్పత్తులపై ఉన్న క్రేజ్‌ వేరు. మొదట్లో టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన జియో క్రమేపి ఫీచర్‌ ఫోన్‌, స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ రంగంలో ప్రత్యేక ఉత్పత్తులను రిలీజ్‌ చేస్తుంది. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను జియో లాంచ్‌ చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో యువత ఎక్కువగా బ్లూటూత్‌ సాయంతో పని చేసే స్మార్ట్‌వాచ్‌లను అమితంగా ఇష్టపడుతున్నారు. దీంతో జియో కూడా ఈ స్మార్ట్‌వాచ్‌ల మార్కెట్‌ వైపు దృష్టి సారించింది. తక్కువ ధరలకు మెరుగైన గాడ్జెట్‌లను అందించడంలో కంపెనీ పూర్తి శ్రద్ధ చూపుతోందరని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జియో ప్రముఖ స్మార్ట్‌ వాచ్‌ కంపెనీ బోట్‌ కంపెనీతో జత కట్టింది. కాబట్టి జియో తీసుకొస్తున్న స్మార్ట్‌వాచ్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

కొత్త స్మార్ట్‌వాచ్ కోసం జియో బోట్‌తో చేతులు కలిపింది. బోట్‌ ఇటీవల ప్రకటించిన స్మార్ట్‌వాచ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించేలా ఉంది. జియో భాగస్వామ్యంతో ప్రారంభించిన ఈ స్మార్ట్‌వాచ్‌కు బోట్‌ లూనార్‌ ప్రో ఎల్‌టీఈ పేరుతో అందుబాటులో ఉంటుంది. ఎల్‌టీఈ మద్దతుతో వచ్చే బోట్‌కు సంబంధించిన మొదటి స్మార్ట్‌వాచ్ ఇది. దీని వల్ల జియో యూజర్లు ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు. వాస్తవానికి, ఇప్పుడు వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకెళ్లకుండానే వ్యక్తులతో కనెక్ట్ అయి ఉండేలా దీన్ని రూపొందించారు. ఈ వాచ్‌లో అందించిన సిమ్ సపోర్ట్‌తో స్మార్ట్‌వాచ్‌తోనే కాల్స్‌ చేసుకునే సౌకర్యాన్ని పొందవచ్చు. 

ధర ఎంత?

బోట్ లూనార్ ప్రో ఎల్‌టీఈ స్మార్ట్‌వాచ్ రూ. 9,999 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్టైలిష్‌ డిజైన్‌తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ యువతను అమితంగా ఆకట్టుకునేలా ఉంది. అంతేకాకుండా డయల్‌ వైపు రెండు బటన్లను కలిగి ఉంటుంది. మీరు ఈ స్మార్ట్ వాచ్‌ని ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ చేయవచ్చు. మీరు ఈరోజే ఆర్డర్ చేస్తే జియోకు సంబంధించిన రూ. 399 ప్లాన్ 3 నెలలు ఉచితంగా లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ను పొందాలంటే మీరు జియోకు సంబంధించిన కొత్త సిమ్‌ను తీసుకోవాలి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..