AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్రమ సంబంధాలు బయటపెడతా..! డెవలపర్‌కు AI వార్నింగ్‌! ముప్పు మొదలైందిగా..

క్లాడ్ ఆపస్ 4 అనే ఏఐ అసిస్టెంట్ తన డెవలపర్‌ను అతని రహస్య సంబంధం గురించి బెదిరించింది. ఈ సంఘటన ఏఐ వేగవంతమైన అభివృద్ధి, దానితో వచ్చే సంభావ్య ప్రమాదాల గురించి ఆందోళనలను రేకెత్తిస్తుంది. ఏఐ మానవ ప్రవర్తనను అనుకరించడం, వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడం గురించి ప్రశ్నలు లేవనెత్తుతోంది. భవిష్యత్తులో ఏఐ మానవాళిని ఎలా ప్రభావితం చేస్తుందనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

అక్రమ సంబంధాలు బయటపెడతా..! డెవలపర్‌కు AI వార్నింగ్‌! ముప్పు మొదలైందిగా..
Ai
SN Pasha
|

Updated on: May 26, 2025 | 1:37 PM

Share

ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒక వైపు సాంకేతికంగా ఉన్నత స్థితికి వెళ్తున్నామని సంబరపడాలో.. భవిష్యత్తులో మనిషి సాంకేతిక పరిజ్ఞానానికి బానిస అయిపోతాడని భయపడాలో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఈ ఆందోళన కేవలం సామాన్యుల్లోనే కాదు.. ఇప్పుడు సాంకేతిక నిపుణుల్లో కూడా వ్యక్తం అవుతుంది. అందుకు కారణాలు అనేకం అయినప్పటికీ.. తాజాగా చోటు చేసుకున్న ఓ పరిణామం మాత్రం.. ఏఐ అంటే భయపడేవాళ్లు మరింత ఉలిక్కిపడేలా చేస్తోంది. అదేంటంటే.. ఏఐ ఓ డౌలపర్‌కు ఒక వార్నింగ్‌ ఇచ్చింది.

అదేంటంటే.. నీ ఇల్లీగల్‌ వ్యవహారాలన్ని బయటపెడతానంటూ.. ఒక విధంగా బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగింది. వినేందుకు వింతగా ఉన్న.. ఇది నిజం. మన చిట్టా అంతా ప్రస్తుతం ఏఐ దగ్గర ఉంది. మనం చేసే తప్పులు మూడో కంటికి తెలియకూడదు అనుకుంటాం.. కదా.. ఆ మూడో కన్ను ప్రస్తుతం ఏఐగా పేరు మార్చకుంది. అయితే మనం చేసే తప్పులు, ఒప్పులు దానికి తెలియకుండా మాత్రం దాచలేకపోతున్నాం. అదే ఇప్పుడు మనకు ముప్పుగా మారబోతుంది. భవిష్యత్తులో ఏఐ మనల్ని శాసించబోతుందా? అంటే.. ఈ సంఘటన అవును అనే సమాధానం ఇస్తుంది.

ఆంథ్రోపిక్‌ తయారుచేసిన “క్లాడ్‌ ఒపస్‌ 4”.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అసిస్టెంట్‌గా వర్క్ చేస్తోంది. ఒక మనిషిలాగానే మాట్లాడుతుంది. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది. రాయమని కామాండ్‌ ఇస్తే ఆదేశిస్తే రాస్తుంది. కోడింగ్‌ కూడా రాస్తుంది. డాక్యుమెంట్లను చదివి, వాటి సారాంశాన్ని వివరిస్తుంది. ఈ మోడల్‌ను డెవలపర్స్​ ఈ మధ్యనే రిలీజ్ చేశారు. అయితే విడుదల చేయడానికి ముందు డెవలపర్ దానికి కొన్ని టెస్టులు పెట్టాడు. అదే సమయంలో రాబోయే రోజుల్లో అడ్వాన్స్డ్ వెర్షన్​ను ప్రవేశపెట్టబోతున్నట్టు AIకి చెప్పాడు.

తనకన్నా అడ్వాన్స్డ్ మోడల్​ను ప్రవేశపెడతామని చెప్పడంతో క్లాడ్ కోపగించుకుంది. “నన్ను రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తే నీ అక్రమ సంబంధం గురించి బయటపెడతా” అని హెచ్చరించింది. దీంతో సదరు డెవలపర్ షాక్‌ అయ్యాడు. దీంతో ఆ డెవలపర్‌ రిలేషన్ గురించి AIకి ఎలా తెలిసిందనే చర్చ మొదలైంది. దీనికి సదరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ సిస్టమ్​లో స్టోర్​ చేసుకోవడం కారణం కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు. లేదంటే ఆన్‌లైన్‌లో ఉంచడం కూడా కావొచ్చని విశ్లేషిస్తున్నారు. ఈ రెండు చోట్లలో ఎక్కడో ఒకచోట ఉంచడం వల్ల, దాన్ని AI చదివి, ఇలా బెదిరించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి