Shocking: AI వీడియోకాల్‌తో రూ.5.15 కోట్ల భారీ మోసం.. ‘డీప్ ఫేక్’ను ఇలా గుర్తించండి..!

|

May 24, 2023 | 11:37 AM

టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతోంది. అయితే, ఈ టెక్నాలజీతో ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. అంతకు మించి దుప్ప్రభావాలు కూడా కనిపిస్తున్నాయి. టెక్నాలజీని మంచి కోసం కంటే.. చెడుకోసం ఉపయోగించే కేటుగాళ్లే ఎక్కువయ్యారు. తాజాగా ఓ వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో చేసిన మోసంలో ఇరుక్కుని దాదాపు రూ. 5.15 కోట్లు పోగొట్టుకున్నాడు.

Shocking: AI వీడియోకాల్‌తో రూ.5.15 కోట్ల భారీ మోసం.. ‘డీప్ ఫేక్’ను ఇలా గుర్తించండి..!
Ai Deep Fake Fraud
Follow us on

టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతోంది. అయితే, ఈ టెక్నాలజీతో ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. అంతకు మించి దుప్ప్రభావాలు కూడా కనిపిస్తున్నాయి. టెక్నాలజీని మంచి కోసం కంటే.. చెడుకోసం ఉపయోగించే కేటుగాళ్లే ఎక్కువయ్యారు. తాజాగా ఓ వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో చేసిన మోసంలో ఇరుక్కుని దాదాపు రూ. 5.15 కోట్లు పోగొట్టుకున్నాడు. AI ద్వారా ఫేక్ వీడియో కాల్ చేసి.. సదరు వ్యక్తిని ట్రాప్ చేశారు. AI డీప్ ఫేక్ టెక్నాలజీ కేటుగాళ్లకు అస్త్రంగా మారింది. అది తెలియని బాధిత వ్యక్తి.. డబ్బును బదిలీ చేసి దారుణంగా మోసపోయాడు. డీప్‌ఫేక్స్, AI ద్వారా ప్రజలు ఎలా మోసపోతున్నారనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ప్రపంచ వ్యాప్తంగా చాలానే జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, డీప్‌ఫేక్, AI టెక్నాలజీ ఆధారిత మోసాలను గుర్తిస్తే నష్టపోకుండా ఉండొచ్చని సాంకేతిక నిపుణులు. వీటిని గుర్తుంచేందుకు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

డీప్‌ఫేక్‌ను గుర్తించేందుకు చిట్కాలు..

1. డీప్‌ఫేక్ వీడియో, ఫోటోలలో వ్యక్తి చర్మం, శరీర భాగాలలో చాలా లోపాలు కనిపిస్తాయి. వాటిని గమనిస్తే మోసానికి గురికాకుండా ఉంటారు.

2. కళ్ళ చుట్టూ నీడలు, వలయాల్లాంటి ఆకారం వస్తుంది.

ఇవి కూడా చదవండి

3. అసాధారణమైన కనురెప్పల కదలికలు. మెరుపు ముఖంలో కనిపిస్తుంది.

4. అద్దాలపై అసాధారణ కాంతి ఉంటుంది.

5. పెదవులు ముఖం కంటే భిన్నమైన సహజ రంగును కలిగి ఉంటాయి.

6. ముఖంపై వెంట్రుకలు, జుట్టులో అసమతుల్యత ఉంటుంది.

7. ముఖంపై నకిలీ పుట్టుమచ్చలు వస్తాయి.

8. అసాధారణమైన ప్రవర్తన/నటన ఉంటుంది.

ఈ సంకేతాల ఆధారంగా డీప్‌ఫేక్ ఆ? లేక నిజమైనదా? గుర్తించాలి.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..