Acer Aspire 5: తక్కువ ధరలో మంచి గేమింగ్ ల్యాప్ టాప్ కోసం చూస్తున్నారా? మీకిదే బెస్ట్ ఆప్షన్.. మిస్ కావొద్దు..

ప్రముఖ టెక్ కంపెనీ ఏసర్ సరికొత్త గేమింగ్ ల్యాప్ టాప్ ను ఆవిష్కరించింది. ఏసర్ ఆస్పైర్ 5 2023 పేరిట ఈ ల్యాప్ టాప్ ను మార్కెట్లో విడుదల చేసింది. దీనిలో అత్యాధునిక 13 జెన్ ఇంటెల్ ప్రాసెసర్‌ ఉంది. మల్టీ గెచర్ సపోర్టెడ్ టచ్ ప్యాడ్ తోపాటు బ్యాక్ లిట్ కీబోర్డు ఉంది.

Acer Aspire 5: తక్కువ ధరలో మంచి గేమింగ్ ల్యాప్ టాప్ కోసం చూస్తున్నారా? మీకిదే బెస్ట్ ఆప్షన్.. మిస్ కావొద్దు..
Acer Aspire 5
Follow us
Madhu

|

Updated on: Jun 01, 2023 | 4:30 PM

ఇటీవల కాలంలో ల్యాప్ టాప్ ల వినియోగం బాగా పెరిగింది. కేవలం సాఫ్ట్ వేర్ ఉద్యోగులే కాకుండా స్కూల్ పిల్లలు కూడా డిజిటల్ ఎడ్యూకేషన్ పేరిట ల్యాప్ టాప్ లను వినియోగిస్తున్నారు. కొంత మంది గేమ్స్ ఆడుకునేందుకు ల్యాప్ టాప్ లను వినియోగిస్తున్నారు. దీంతో వాటి కొనుగోళ్లు భారీగా పెరిగాయి. దీంతో కంపెనీలు కూడా మంచి ఫీచర్లతో కూడిన ల్యాప్ టాప్ లను తక్కువ ధరకే అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ టెక్ కంపెనీ ఏసర్ సరికొత్త గేమింగ్ ల్యాప్ టాప్ ను ఆవిష్కరించింది. ఏసర్ ఆస్పైర్ 5 2023 పేరిట ఈ ల్యాప్ టాప్ ను మార్కెట్లో విడుదల చేసింది. దీనిలో అత్యాధునిక 13 జెన్ ఇంటెల్ ప్రాసెసర్‌ ఉంది. మల్టీ గెచర్ సపోర్టెడ్ టచ్ ప్యాడ్ తోపాటు బ్యాక్ లిట్ కీబోర్డు కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో పాటు ధర గురించి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్పెసిఫికేషన్లు ఇవి..

ఏసర్ ఆస్పైర్ 5 ల్యాప్ టాప్ లో 13వ జెన్ ఇంటెల్ కోర్ ఐ5 133 యూ ప్రాసెసర్‌తో వస్తుంది. జీఫోర్స్ ఆర్టీఎక్స్ 2050 జీపీయూ కలిగి ఉంటుంది. 14- అంగుళాల ఫుల్ హెచ్డీ (1900×1200 పిక్సెల్స్) డబ్ల్యూయూఎక్స్‌జీఏ డిస్ ప్లే‌ ఉంటుంది. ప్రీ-ఇన్‌స్టాల్డ్ విండో 11 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. రీఫ్రెష్ రేట్ 60 Hz ఉంటుంది. యాస్పెక్ట్ రేషియో 16:10, 170 డిగ్రీస్ వ్యూయింగ్ యాంగిల్ కలిగి ఉంటుంది. కంపెనీ కాంఫీ వ్యూ ఎల్ఈడీ-బ్యాక్ లిట్ టీఎఫ్టీ ఎల్సీడీ కీ బోర్డు ఉంటాయి. 8జీబీ డ్యుయల్ చానెల్ ఎల్పీడీడీఆర్4 ఎస్డీరామ్ 32 జీబీ వరకు పొడిగించుకవచ్చు. ఇది వై-ఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, ఎంయూ-మిమో టెక్నాలజీ, గిగాబైట్ ఈదర్ నెట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. 50 వాట్ల బ్యాటరీ విత్ 65 వాట్ల చార్జింగ్ సపోర్ట్, స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది.

ధర, లభ్యత..

అప్‌డేటెడ్ ఎసేర్ ఎస్పైర్ 5 ల్యాప్ టాప్ ధర భారత్ మార్కెట్లో రూ.70,990గా ఉంది. 13వ జెన్ ఇంటెల్ కోర్ ఐ7 1335 యూ ప్రాసెసర్ గల ల్యాప్ టాప్ ధర రూ.94,999లకు లభిస్తుంది. రెండు వేరియంట్లు గ్రే కలర్డ్ లైట్ వెయిట్ మెటల్ బాడీ కలిగి ఉంటాయి. ఎసేర్ ఈ-స్టోర్, క్రోమా, విజయా సేల్స్, అమెజాన్ వెబ్ సైట్లలో కొనుగోలు చేయొచ్చు. ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ గల లాప్ టాప్ రూ.78,788, ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ గల ల్యాప్ టాప్ రూ.89,885లకు అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి రూ.3746, రూ.4296తో ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే