‘సచిన్ కూతురు సారా’, ‘క్రికెటర్ శుభ్ మాన్ గిల్’ మధ్య ఏం జరుగుతోంది?
.సాధారణంగా సినీ, రాజకీయ సెలబ్రిటీలు, క్రీడాకారులు ఏం చేసినా.. అవి విపరీతంగా వైరల్ అవుతాయన్న సంగతి తెలిసిందే. అందులోనూ ఈ మధ్య అందరూ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ ఉంటున్నారు. అలాగే సెలబ్రిటీస్ కూడా ఏం పోస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఈ మధ్య ఫ్యాన్స్ ఎక్కువగా గమనిస్తూనే..
సాధారణంగా సినీ, రాజకీయ సెలబ్రిటీలు, క్రీడాకారులు ఏం చేసినా.. అవి విపరీతంగా వైరల్ అవుతాయన్న సంగతి తెలిసిందే. అందులోనూ ఈ మధ్య అందరూ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ ఉంటున్నారు. అలాగే సెలబ్రిటీస్ కూడా ఏం పోస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఈ మధ్య ఫ్యాన్స్ ఎక్కువగా గమనిస్తూనే ఉంటున్నారు. ఇక వారిపై వివిధ రకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. కొందరు సెలబ్రిటీస్ అయితే ఇవి పుకార్లని ఎప్పటికప్పుడు తేల్చేస్తూంటారు. మరికొందరు సెలబ్రిటీలు మాత్రం.. అస్సలు పట్టించుకోరు.
తాజాగా ఇప్పుడు క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ కూతురు సారా, యంగ్ క్రికెటర్ శుభ్ మాన్ గిల్‌కి మధ్య ఏం జరుగుతుంది? అనే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ”గిల్-సారా సోషల్ మీడియాలో చాలా కాలం నుంచి ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా ఒకరి పోస్ట్‌కు మరొకరు స్పందిస్తూనే ఉంటున్నారు. ఆ మధ్య ఓ సారి గిల్ కొత్త కారు కొన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి సారా స్పందిస్తూ అభినందనలు తెలిపింది. ”అయితే గిల్ ట్వీట్‌పై హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. నీ బదులు నేను సారాకు కృతజ్ఞతలు చెప్తాను బ్రో” అని కామెంట్ చేశాడు. ఇది కాస్తా నెట్టింట్లో వైరల్గా మారింది.
ఇప్పుడు మరోసారి తాజాగా క్రికెటర్ గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటో పోస్ట్ చేస్తూ ‘ఐ స్పై’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక సారా కూడా అదే సమయానికి తన ఇన్‌స్టాలో ‘ఐ స్పై’ అనే క్యాప్షన్ ఇస్తూ తన ఫొటోను పోస్ట్ చేసింది. ఇక ఈ విషయాన్ని గమనించిన అభిమానులు మేము మిమ్మల్ని ఎప్పుడూ స్సై చేస్తూనే ఉంటాము అని రకరకాల మీమ్స్ చేస్తున్నారు”. అయితే వీరిద్దరి మధ్య నిజంగా ఏదైనా ఉందా? లేదా అనేది తెలియాలంటే ఎవరో ఒకరు ఈ విషయంపై స్పందించాల్సిందే.
Read More:
ప్రముఖ నటుడు శరత్ కుమార్‌కి షాక్.. ఫోన్ హ్యాక్ చేసి బెదిరింపులు..
తన తాతను తలుచుకుని ఎమోషనల్ అయిన బన్నీ.. ట్వీట్ చేస్తూ..