ఐపీఎల్ 2020 : ఎక్కువమంది ప్లేయర్స్, తక్కువ స్టాఫ్
ఐపీఎల్-13 షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు మ్యాచులు జరుగుతాయని లీగ్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ అనౌన్స్ చేసినా.. ఫైనల్ మ్యాచ్ రెండు రోజులు లేటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

IPL News :ఐపీఎల్-13 షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు మ్యాచులు జరుగుతాయని లీగ్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ అనౌన్స్ చేసినా.. ఫైనల్ మ్యాచ్ రెండు రోజులు లేటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే నవంబర్ 8న జరగాల్సిన ఫైనల్‌ను 10న నిర్వహిస్తారని బీసీసీఐ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. దీనిపై అఫిషియల్ ప్రకటన రాకపోయినా.. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో క్లారిటీ రానుంది. గవర్నింగ్ కౌన్సిల్ ఈ ఆదివారం సమావేశం అయి వివిధ అంశాలపై చర్చింనుంది.
కాగా ఐపీఎల్ కు సంబంధించి సాధారణంగా టీమ్ లో 25నుంచి 28 మంది స్క్వాడ్ ఉంటారు. మరో 10 నుంచి 15 మంది సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. కాగా ఈ సారి ప్రతి టీమ్ యాజమాన్యం కాగా టీమ్ స్క్వాడ్ తగ్గించడంపై ఫోకస్ పెట్టమని ఐపీఎల్ యాజమాన్యం కోరనుంది. అందుకు సంబంధించి యూఏఈ వెళ్లడానికి నెల రోజుల ముందుగానే డిటేల్స్ ఇవ్వాలని మేనేజ్మెంట్ సూచించే అవకాశాలు ఉన్నాయి. 2014 లో యుఏఈలో ఐపిఎల్ చివరిసారిగా జరిగినప్పుడు, టీమ్స్ స్క్వాడ్ సంఖ్యను తగ్గించాయి. ఈ ఏడాది వైరస్ నేపథ్యంలో డ్రస్సింగ్ రూమ్ లో సభ్యుల సంఖ్య తగ్గించాలని యాజమాన్యం భావిస్తోంది. అయితే కొనుగోలు చేసిన ఏ ప్లేయర్ ఎప్పుడు ఉపయోగపడతారో తెలియదు. మ్యాచ్ పిచ్, వాతావరణ పరిస్థితులను బట్టి గేమ్ ప్లాన్ లో భాగంగా చివరి నిమిషంలో కూడా మార్పు, చేర్పులు చేసుకోవచ్చు. అందుకే టీమ్ సభ్యుల సంఖ్యను స్వల్పంగా తగ్గించి, సపోర్టింగ్ స్టాఫ్ ను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.




