తమిళనాడులో కొత్తగా మరో 5,881 కేసులు
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా నిత్యం ఐదు నుంచి ఆరు వేల వరకు పాజిటివ్..
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా నిత్యం ఐదు నుంచి ఆరు వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు దిగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కఠినంగా లాక్‌డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 5,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,45,859కి చేరింది. ఇక వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,83,956 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 97 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారినపడి 3,935 మంది మరణించారు.
కాగా, రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చెన్నై నగరంలోనే నమోదవుతున్నాయి.
Tamil Nadu reported 5,881 new #COVID19 cases and 97 deaths today, taking total cases to 2,45,859 including 1,83,956 discharges and 3,935 deaths: State Health Department pic.twitter.com/dCzCQ4lJ7R
— ANI (@ANI) July 31, 2020
Read More
కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
తైవాన్ మాజీ అధ్యక్షుడు ఇక లేరు