Virat Kohli: అనుష్కతో వీడియో కాల్‌లో కోహ్లి, అంతలోనే అభిమానుల కోలాహలం.. విరాట్‌ ఏం చేశాడంటే..

కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తుంటాడు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి. మ్యాచ్‌లో జరిగే చోటుకు భార్యను తీసుకెళ్తుంటాడు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వెంటనే...

Virat Kohli: అనుష్కతో వీడియో కాల్‌లో కోహ్లి, అంతలోనే అభిమానుల కోలాహలం.. విరాట్‌ ఏం చేశాడంటే..
Viratkohli Anushka Video

Updated on: Sep 30, 2022 | 6:50 AM

కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చే వారిలో టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ముందు వరుసలో ఉంటారు. కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తుంటాడు. మ్యాచ్‌లో జరిగే చోటుకు భార్యను తీసుకెళ్తుంటాడు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వెంటనే రెక్కలు కట్టుకొని విదేశాల్లో వాలిపోతుంటారు. అంతేకాకుండా కలవేని దూరంలో ఉన్నా కూడా ఈ జంట వర్చువల్‌గానైనా కలిసే ఉంటుంది. తాజాగా తిరువనంతపురంలో కెమెరా కంటికి చిక్కిన విషయం దీనికి ప్రత్యక్షసాక్ష్యంగా నిలిచింది.

వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20లో టీమిండియా ఘన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ ముగిసిన అనంతరం తిరువనంతపురంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషన్‌ స్టేడియంలో నుంచి జట్టు సభ్యులంతా బస్సులో తిరుగుపయనవుతుండగా అభిమానులు బస్సు చుట్టూ చేరి పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. కోహ్లిని చూసి హంగామా చేశారు. అయితే ఆ సమయంలో కోహ్లి భార్య అనుష్క శర్మతో వీడియో కాల్‌ మాట్లాడుతున్నాడు. దీంతో వెంటనే తన చేతిలో ఫోన్‌ను ఫ్యాన్స్‌ వైపు తిప్పి అనుష్కను చూపించాడు. దీంతో అభిమానులు మరింత జోజ్‌తో సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 మ్యాచ్‌ అక్టోబర్‌ 2వ తేదీన గువహటిలో జరగనున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ విజయాన్ని కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే కసితో ఉంది. ఇక దక్షిణాఫ్రికా ఎలాగైనా విజయాన్ని సాధించి బోణీ కొట్టాలని చూస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..