విరాట్ మాజీ ప్రేయసితో చాట్ చేశానంటోన్న ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ ప్రియురాలుతో చాట్‌చేస్తే అతడికి నచ్చేది కాదని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంప్టన్ వెల్లడించాడు. తాజాగా క్రికెట్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ 2012 ఇండియా టూర్ సందర్భంగా తన టెస్టు ఎంట్రీపై స్పందించాడు.

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ ప్రియురాలుతో చాట్‌చేస్తే అతడికి నచ్చేది కాదని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంప్టన్ వెల్లడించాడు. తాజాగా క్రికెట్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ 2012 ఇండియా టూర్ సందర్భంగా తన టెస్టు ఎంట్రీపై స్పందించాడు. ఈ నేపథ్యంలోనే ఆ సిరీస్‌లో విరాట్ తో గొడవ జరిగిందని చెప్పాడు. ‘నేను ఆమెతో చాట్ చేశాను. ఆ విషయం బయటకు తెలిసింది. అది కోహ్లీకి తెలిసి సీరియస్ అయ్యాడు. నేను బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు పదాలు ఘాటుగా ప్రయోగించాడు. ఆమె తన ప్రియురాలు అని చెప్పే ప్రయత్నం చేసేవాడు. ఆమె కూడా అతడు తన మాజీ ప్రేయుడని చెప్పింది. ఆ పరిస్థితి ఎలా ఉండేదంటే.. ఎవరు నిజం చెబుతున్నారో తెలిసేది కాదు. నేనేం చెబుతున్నానో మీకు అర్థయ్యే ఉంటుంది’ అని కాంప్టన్ పేర్కొన్నాడు.
అప్పుడా విషయం చాలా ఫన్నీగా అనిపించిందని, తర్వాత అది ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరికీ తెలిసిందని చెప్పాడు. కోహ్లీని రెచ్చగొట్టడానికి అదొక సాధనంగా ఉపయోగపడిందని పేర్కొన్నాడు. దాంతో అతడి కాన్సన్ట్రేషన్ దెబ్బతీయాలని చూసేవారమని వివరించాడు. అయితే, అప్పుడు కోహ్లీ ప్రేయసిగా ఉన్న ఆమె పేరును మాత్రం నిక్ కాంప్టన్ రివీల్ చెయ్యలేదు.




