Neeraj Chopra-Family: నీరజ్ చోప్రా విజయాన్నిసెలబ్రేట్ చేసుకుంటున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు
Neeraj Chopra-Family: టోక్యో ఒలింపిక్స్ లో భరత దేసాహ్నికి అథ్లెటిక్స్ విభాగంలో మొదటి స్వర్ణాన్ని అందించిన నీరజ్ చోప్రా విజయాన్ని యావత్ భారతం సెలబ్రేట్ చేసుకుంటుంది. తాజాగా నీరజ్ చోప్రా స్వస్థలం హరియాణా లోని..
Neeraj Chopra-Family: టోక్యో ఒలింపిక్స్ లో భరత దేసాహ్నికి అథ్లెటిక్స్ విభాగంలో మొదటి స్వర్ణాన్ని అందించిన నీరజ్ చోప్రా విజయాన్ని యావత్ భారతం సెలబ్రేట్ చేసుకుంటుంది. తాజాగా నీరజ్ చోప్రా స్వస్థలం హరియాణా లోని పానిపట్ సమీపంలోని ఖండ్రా గ్రామం. ఉమ్మడి కుటంబం. వ్యవసాయమే ప్రధాన వృత్తి.. నీరజ్ చిన్నతనంలో భారీ కాయంతో ఉండేవాడు.. దీంతో తండ్రి సతీష్ ఆటలు ఆడితే.. కొంచెం బరువు తగ్గుతాడని భావించి పనీపాట స్టేడియంకి తీసుకెళ్లాడు.. నీరజ్ క్రీడాకారుడిగా అక్కడ అలా మొదలైన జర్నీ నేడు.. టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ అందుకునెలా చేసింది. ఇక 17 మంది సభ్యలున్న ఉమ్మడి కుటుంబంలో నీరజ్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక నీరజ్ విజయాన్ని కీర్తిస్తూ సైకత శిల్పం తో కీర్తించారు.
#WATCH live from javelin thrower Neeraj Chopra’s residence in Panipat, Haryana
Chopra wins gold at #TokyoOlympics https://t.co/0kj0q2Pruu
— ANI (@ANI) August 7, 2021
బరువు తగ్గడం కోసం క్రీడా మైదానంలో అడుగు పెట్టిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో లో పట్టు సాధించి జిల్లా క్రీడాకారుడిగా అనేక విజయాలను సొంతం చేసుకున్నాడు. నీరజ్ పట్టుదలతో అంచెలంచెలుగా ఎదుగుతూ పంచ్‌కులాలోని ‘సాయ్’ స్పోర్ట్స్ హాస్టల్‌కు చేరుకున్నాడు. నీరజ్ కు వివిధ దశల్లో కోచ్‌లుగా వ్యవహరించిన గ్యారీ కాల్‌వర్ట్, యువ్ హాన్ అతడి ఆటను మరో మెట్టు పైకి తీసుకుని వెళ్ళాడు. ప్రస్తుత కోచ్ క్లాస్ బార్టోనెట్జ్ నీరజ్‌ను ఒలింపిక్స్ చాంపియన్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read: నా కలను నెరవేర్చిన నా కుమారుడు నీరజ్‌కు అభినందనలు : పరుగుల రాణి పీటీ ఉష