Neeraj Chopra Biopic: నీరజ్ చోప్రా.. ప్రస్తుతం పరిచయం చేయాల్సిన అవసరం లేనిపేరు. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించి, హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. నీరజ్ చోప్రా 13 సంవత్సరాలలో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయుడిగాను నిలిచాడు. దీంతో మనోడి పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒలింపిక్స్‌కు ముందు లక్షలోపే ఉన్న ఫాలోవర్లు.. టోక్యోలో నీరజ్ అద్భుత ప్రదర్శనతో అమాంతం 30లక్షల వరకు పెరగడం చూస్తే.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో పెరగిపోయిందో తెలుసుకోవచ్చు. నీరజ్ ఆటగాడిగానే కాదు అతని స్టైల్‌కి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. అథ్లెటిక్స్‌లో రికార్డులు నెలకొల్పిన నీరజ్‌కు ప్రశంసలతోపాటు నగదు బహుమతులు వెల్లువెత్తుతున్నాయి.
పనిలో పనిగా నీరజ్ చోప్రా బయోపిక్‌పై నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. అలాగే నీరజ్ బయోపిక్‌లో హీరోగా ఎవరు నటించాలో కూడా పలువురు సూచిస్తున్నారు. మరి ఇదే ప్రశ్నకు నీరజ్ ఏమన్నాడో తెలుసా… హీరో రణ్‌దీప్ హుడా లేదా అక్షయ్ కుమార్ అంటే నాకిష్టమని, వీరిలో ఎవరు నటించినా.. నాకు ఇష్టమేనని సమాధానమిచ్చాడు. 2018 ఆసియా క్రీడలు ముగిసిన తరువాత ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు సమాధానమిచ్చాడు. అలాగే ఆయన మాట్లాడుతూ, ‘‘ నా బయోపిక్ తీయాలనే ఆలోచన రావడం సంతోషంగానే ఉంది. మా రాష్ట్రానికి(హరియాణా) చెందిన బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా, హీరో అక్షయ్ కుమార్‌లు అంటే నాకు చాలా ఇష్టం. వీరిలో ఎవరు నటించినా బాగుంటుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.
టోక్యోలో స్వర్ణం సాధించిన అనంతరం ఈ హీరోలిద్దరూ నీరజ్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. కాగా వీటిలో నటుడు అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్ బాగా వైరల్‌గా మారింది. అక్షయ్‌కు మరో కొత్త సినిమా దొరికేసిందంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తూ వైరల్ చేస్తు్న్నారు. ఈమేరకు గతంలో అక్షయ్ కుమార్ జావెలిన్ త్రో దిగిన ఓ ఫొటోను పంచుకుంటూ తెగ సందడి చేస్తున్నారు. నీరజ్ చోప్రా బయోపిక్ సెట్స్ నుంచి లీకైన ఫొటోలంటూ వైరల్ చేస్తున్నారు.
It’s a GOLD ?Heartiest Congratulations @Neeraj_chopra1 on creating history. You’re responsible for a billion tears of joy! Well done #NeerajChopra! #Tokyo2020 pic.twitter.com/EQToUJ6j6C
— Akshay Kumar (@akshaykumar) August 7, 2021
Also Read: IPL 2021: ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌కు సరికొత్త రూల్.. బౌలర్లకు భారంగా మారనుందా?
Viral Video: కన్నడ టీచర్ అవతారమెత్తిన రాహుల్ ద్రవిడ్.. మాకు నేర్పించాలంటూ నెటిజన్ల రిక్వెస్టులు