గోల్ఫ్ క్రీడలో అద‌ర‌గొడుతోన్న టైగర్ వుడ్స్ త‌న‌యుడు

టైగర్ వుడ్స్ కుమారుడు చార్లీ(11) గోల్ఫ్ క్రీడ‌లో తన తండ్రి అడుగుజాడల్లోనే ప‌య‌నిస్తున్నాడు. గత వారాంతంలో, ఫ్లోరిడాలోని పామ్ సిటీలోని హమాక్ క్రీక్ గోల్ఫ్ క్లబ్‌లో యు.ఎస్. కిడ్స్ గోల్ఫ్- పోటీల్లో చార్లీ పాల్గొన్నాడు

గోల్ఫ్ క్రీడలో అద‌ర‌గొడుతోన్న టైగర్ వుడ్స్ త‌న‌యుడు
Follow us

|

Updated on: Aug 18, 2020 | 3:36 PM

టైగర్ వుడ్స్ కుమారుడు చార్లీ(11) గోల్ఫ్ క్రీడ‌లో తన తండ్రి అడుగుజాడల్లోనే ప‌య‌నిస్తున్నాడు. గత వారాంతంలో, ఫ్లోరిడాలోని పామ్ సిటీలోని హమాక్ క్రీక్ గోల్ఫ్ క్లబ్‌లో యు.ఎస్. కిడ్స్ గోల్ఫ్- పోటీల్లో చార్లీ పాల్గొన్నాడు. అక్కడ ఈ బుడ‌త‌డు తన ప్రత్యర్థులను సులభంగా ఓడించి లీడర్‌బోర్డ్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. యు.ఎస్. కిడ్స్ గోల్ఫ్ వెబ్‌సైట్ స‌మాచారం ప్రకారం, బాలుర 11 ఏళ్ల విభాగంలో అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు . రెండో స్థానంలో ఉన్న ఫినిషర్‌ను 5 స్ట్రోక్‌లతో ఓడించాడు. వుడ్స్ కూడా ఈ ఈవెంట‌కు హాజ‌ర‌య్యాడు. మ్యాచ్‌లు జ‌రుగుతున్నంత‌సేపు కుమారుడు సూచ‌న‌లు చేస్తూ క‌నిపించాడు.