అగ్ర స్థానాలు నిలబెట్టుకున్న మంధానా, జులన్‌ గోస్వామి

అగ్ర స్థానాలు నిలబెట్టుకున్న మంధానా, జులన్‌ గోస్వామి

దుబాయ్‌: ఐసీసీ ప్రకటించిన అంతర్జాతీయ మహిళా క్రికెట్‌ వన్టే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధానా, బౌలర్‌ జులన్‌ గోస్వామి టాప్ స్థానాలను నిలుపుకున్నారు. ఐసీసీ శుక్రవారం ప్లేయర్స్‌తో పాటు, టీమ్ ర్యాంకింగ్స్‌ను కూడా ప్రకటించింది. మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్న స్మృతి మంధానా  తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తరువాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లీస్‌ పెర్రీ, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ అమీ సాటర్త్‌వైట్‌, టీమిండియా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, వెస్టీండీస్‌ కెప్టెన్‌ స్టాఫనీ టేలర్‌ ఉన్నారు. […]

Ram Naramaneni

|

Mar 22, 2019 | 8:57 PM

దుబాయ్‌: ఐసీసీ ప్రకటించిన అంతర్జాతీయ మహిళా క్రికెట్‌ వన్టే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధానా, బౌలర్‌ జులన్‌ గోస్వామి టాప్ స్థానాలను నిలుపుకున్నారు. ఐసీసీ శుక్రవారం ప్లేయర్స్‌తో పాటు, టీమ్ ర్యాంకింగ్స్‌ను కూడా ప్రకటించింది. మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్న స్మృతి మంధానా  తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తరువాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లీస్‌ పెర్రీ, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ అమీ సాటర్త్‌వైట్‌, టీమిండియా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, వెస్టీండీస్‌ కెప్టెన్‌ స్టాఫనీ టేలర్‌ ఉన్నారు. బౌలర్ల విభాగంలో టీమిండియా బౌలర్‌ జులన్‌ గోస్వామి మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా, ఆస్ట్రేలియాకు చెందిన జెస్‌ జొన్నాసెన్‌, పాకిస్థాన్‌కు చెందిన సానా మిర్‌, ఆస్ట్రేలియాకు చెందిన మీగన్‌ స్కట్‌, భారత్‌ బౌలర్‌ షికా పాండే తరువాతి ర్యాంకుల్లో ఉన్నారు. ఐసీసీ టీమ్స్ ర్యాంకింగ్‌లో  22 పాయింట్లతో ఆస్ట్రేలియా  ఫస్ట్ ప్లేస్‌లో  నిలవగా, 18 పాయింట్లతో ఇంగ్లండ్‌, 16 పాయింట్లతో భారత్,  14 పాయింట్లతో న్యూజిలాండ్‌, 13 పాయింట్లతో సౌతాఫ్రికా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu