
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మందాన్న మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో 63 బంతుల్లో 74 పరుగులు చేసిన స్మృతి.. వన్డేలో అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచింది. దీంతో క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు సాధించిన మూడో క్రికెటర్‌గా స్మృతీ తన పేరును లిఖించుకుంది. ఫలితంగా శిఖర్ ధావన్(48 ఇన్నింగ్స్‌లో) తర్వాత అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న రెండో ఇండియన్ క్రికెటర్‌గా కూడా స్మృతీ(51 ఇన్నింగ్స్‌లో) నిలిచింది. కాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బెలిండా క్లార్క్(45ఇన్నింగ్స్)లో అగ్రస్థానంలో ఉంది. టీమిండియా కెప్టెన్ కోహ్లీ కంటే కూడా మంధాన ఈ రికార్డును సాధించడం విశేషం. 53వ ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఈ రికార్డును పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు జులన్ గోస్వామి, పొన్నమ్ యాదవ్ రాణించడంతో ఆతిథ్య జట్టు 194కే ఔట్ అయ్యింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 2-1తో కైవసం చేసుకుంది.