సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన ప్రజంట్ జనరేషన్‌లో ఏది జరిగినా క్షణాల్లో ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతుంది. వెంటనే వాటిపై నెటిజన్లు అభిప్రాయాలు కూడా వచ్చేస్తాయ్. చేసింది మంచి పనైతే..ప్రశంసలు..కాస్త తొందరపాటు పని అయితే వెటకారం చేస్తూ ట్రోల్స్ అస్సలు తప్పడం లేదు. తాజాగా పాకిస్థాన్ జట్టు సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చేసిన పనికి నెటిజన్లు యమ వెటకారం చేస్తున్నారు. శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఔటయిన విధానమే ఇందుకు కారణం. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఇది చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ వేసిన బంతిని మాలిక్ ఆడాడు. తానున్న స్థానం నుంచి కాస్త వెనకకు వెళ్లి బంతిని కొట్టబోయి స్టంప్స్‌ను కొట్టాడు. షోయబ్ ఆడిన విధానానికి బౌలర్లు సైతం ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ తమ అఫిషియల్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఇది బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు మాలిక్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘క్రీజులో ఉన్నప్పుడు బంతిని కొట్టాలి కానీ..స్టంప్స్‌ను కొట్టకూడదు’, ‘షోయబ్..నువ్వాడేది టెన్నిస్ కాదు..క్రికెట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Don’t see this too often!
Scorecard & Videos: https://t.co/A8uZh11q6U#EngvPak pic.twitter.com/HxUAK2A5qG
— England Cricket (@englandcricket) May 17, 2019