AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shikhar Dhawan: పాక్ ఆటగాళ్లతో ఆడుతున్నానంటూ తప్పుడు ప్రచారం.. లీగల్ యాక్షన్‌కు దిగిన టీమిండియా మాజీ ఓపెనర్

Shikhar Dhawan: వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ టోర్నమెంట్ జాబితాలో తన పేరు ఉండటంపై టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా పేరు వాడిన నిర్వాహకులపై లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్లు హెచ్చరించారు. పాకిస్థాన్ ఆటగాళ్లతో తాను ఆడుతున్నానంటూ వస్తున్న ఫేక్ వార్తలను నమ్మవద్దని అభిమానులను కోరారు.

Shikhar Dhawan: పాక్ ఆటగాళ్లతో ఆడుతున్నానంటూ తప్పుడు ప్రచారం.. లీగల్ యాక్షన్‌కు దిగిన టీమిండియా మాజీ ఓపెనర్
Shikhar Dhawan
Rakesh
|

Updated on: Oct 14, 2026 | 9:41 AM

Share

Shikhar Dhawan: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ టోర్నమెంట్‌లో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి అనుమతి లేదా సమాచారం ఇవ్వకుండానే నిర్వాహకులు తన పేరును ఆటగాళ్ల జాబితాలో చేర్చడంపై ధావన్ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఆయన తన లీగల్ టీంతో కలిసి కఠినమైన న్యాయపరమైన చర్యలకు దిగనున్నట్లు సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.

పాకిస్థాన్ ఆటగాళ్లతో జట్టులో పేరు

ఆ టోర్నమెంట్‌లో ఏషియా వారియర్స్ అనే జట్టు తరఫున శిఖర్ ధావన్ ఆడనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ జట్టులో పాకిస్థాన్‌కు చెందిన పలువురు క్రికెటర్లు సోహైల్ తన్వీర్, ఇఫ్తికార్ అహ్మద్, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా భారత్ తరఫున రాహుల్ శర్మ, గురుకీరత్ సింగ్ మన్, అభిమన్యు మిథున్ పేర్లు కూడా ఆ జాబితాలో చేర్చారు. తమతో ఎలాంటి సంబంధం లేని ఈ టోర్నమెంట్‌లో పేర్లను వాడటం పట్ల భారత ఆటగాళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా క్లారిటీ

ఈ వివాదంపై సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా శిఖర్ ధావన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ టోర్నమెంట్‌లో తన పేరు ఉండటాన్ని తాను చూశానని, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నిర్వాహకులు ఈ పని చేశారని తెలిపారు. అభిమానులు, మీడియా ఈ వదంతులను నమ్మవద్దని కోరారు. తన లీగల్ టీమ్ త్వరలోనే తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తేల్చిచెప్పారు. నిరంతరం ప్రేమ అందిస్తున్న అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో పాకిస్థాన్‌పై ధావన్ గట్టి స్టాండ్

పాకిస్థాన్ ఆటగాళ్లతో కలిసి ధావన్ బరిలోకి దిగనున్నారనే వార్త క్రికెట్ అభిమానులను తీవ్ర విస్మయానికి గురిచేసింది. గతంలో ఉగ్రవాద దాడుల సమయంలో, ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్థాన్‌పై ధావన్ అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దేశమే ముందుంటుందని, ఉగ్రవాదాన్ని ఎప్పుడూ సహించేది లేదని ఆయన బహిరంగంగానే తన దేశభక్తిని చాటుకున్నారు. అలాంటి వ్యక్తి పాక్ ఆటగాళ్లతో కలిసి మ్యాచ్ ఆడతారనే తప్పుడు ప్రచారం రావడంతో ఆయన వెంటనే రంగంలోకి దిగి లీగల్ యాక్షన్ తీసుకుంటామని ప్రకటించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
లీగల్ యాక్షన్‌కు దిగిన టీమిండియా మాజీ ఓపెనర్
లీగల్ యాక్షన్‌కు దిగిన టీమిండియా మాజీ ఓపెనర్
లవ్ బర్డ్స్ తాట తీసిన నరేష్.. ఒక్కో ప్రశ్నతో ఏకిపారేశాడుగా..
లవ్ బర్డ్స్ తాట తీసిన నరేష్.. ఒక్కో ప్రశ్నతో ఏకిపారేశాడుగా..
టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మాసీ సీఎం మమతా బెనర్జీపై హత్యాయత్నం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు!
మాసీ సీఎం మమతా బెనర్జీపై హత్యాయత్నం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు!
నవరాత్రుల నాలుగో రోజు మహా చండీదేవి అలంకారంలో కనకదుర్గ..
నవరాత్రుల నాలుగో రోజు మహా చండీదేవి అలంకారంలో కనకదుర్గ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ డ్రామా..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ డ్రామా..
ఎప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేని సచిన్ ఆ 3 రికార్డులు ఇవే
ఎప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేని సచిన్ ఆ 3 రికార్డులు ఇవే
దసరా రోజు జమ్మిఆకులను ఎందుకు పంచుకుంటారు..దీని వెనక రహస్యం తెలుసా
దసరా రోజు జమ్మిఆకులను ఎందుకు పంచుకుంటారు..దీని వెనక రహస్యం తెలుసా
హైదరాబాద్‌లో భారత్-విండీస్ పోరు.. వైభవ్‌ కి చోటు దక్కుతుందా ?
హైదరాబాద్‌లో భారత్-విండీస్ పోరు.. వైభవ్‌ కి చోటు దక్కుతుందా ?
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. 2,721 పోస్ట్‌లతో నోటిఫికేషన్
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. 2,721 పోస్ట్‌లతో నోటిఫికేషన్