Sachin Tendulkar : ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న శునకం.. నెట్టింట్లో వైరల్‌గా మారిన సచిన్ పోస్ట్..
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారిపోయాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తన వ్యక్తిగత విషయాలతో పాటు
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారిపోయాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలోని పలు విషయాలపై తన అభిప్రాయలను పంచుకుంటున్నాడు. అలా తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడీ లెజెండరీ క్రికెటర్. ఇందులో ఇద్దరు పిల్లలు క్రికెట్ ఆడుతుండగా ఓ కుక్క వారికి సాయం చేస్తుంది. ఫీల్డర్‌గా బంతిని అందుకోవడంతో పాటు కీపర్‌గా వికెట్ల వెనకాల నిలబడుతుంది. ఆతర్వాత బంతిని నోట కరుచుకుని బౌలర్‌కు అందజేస్తుంది.
ఇలా ఆల్‌రౌండ్ పనులు చేసిన శునకం నైపుణ్యాలకు ముగ్ధుడైన సచిన్ ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ. ‘ ఓ ఫ్రెండ్ ద్వారా ఈ వీడియో నా దగ్గరకు వచ్చింది. క్రికెట్‌లో మనం వికెట్ కీపర్లు, ఫీల్డర్లు, ఆల్‌రౌండర్లను చూసి ఉంటాం. కానీ ఈ శునకం చేస్తున్న పనులకు మీరేం పేరు పెడతారు’ అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. సచిన్ పోస్ట్ చేసిన వీడియో క్రికెట్ అభిమానులతో పాటు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ‘వావ్’, ‘క్యూట్’, ‘టామీ రోడ్స్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Received this from a friend and I must say, those are some ‘sharp’ ball catching skills ?
We’ve seen wicket-keepers, fielders and all-rounders in cricket, but what would you name this? ? pic.twitter.com/tKyFvmCn4v
— Sachin Tendulkar (@sachin_rt) November 22, 2021
Also Read:
Dhananjaya de Silva: దురదృష్టం చూడండి ఎలా వెంటాడిందో.. పాపం డి సిల్వా..