ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన రోహిత్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన స్పెషల్-5 బ్యాట్స్‌మెన్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలతో రోహిత్ శర్మ 648 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించిన హిట్‌మ్యాన్ 81 సగటుతో నిలిచాడు. తాజాగాక్రికెట్ వరల్డ్ కప్ తన ట్విటర్ పేజీలో టాప్-5 స్పెషల్ బ్యాట్స్‌మెన్ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్ మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో డేవిడ్ వార్నర్, మూడోస్థానంలో షకీబుల్ హసన్, నాలుగో స్థానంలో కేన్ విలియమ్సన్, ఐదో స్థానంలో జోయి రూట్ ఉన్నారు. ఇక పరుగుల ప్రకారం చూసుకుంటే.. రోహిత్ కన్నా ఒక్క పరుగు తక్కువ చేసిన డేవిడ్ వార్నర్ 647 పరుగులతో, 71.89 సగటుతో రెండో స్థానాన్ని సాధించాడు. బంగ్లాదేశ్ తరపున అద్భుతంగా ఆడిన షకీబుల్ హసన్ 86.57 సగటుతో 606 పరుగులు చేశాడు. కేన్ విలియంసన్ 578 పరుగులతో నాల్గవ స్థానంలో, జూ రూట్ 556 పరుగులతో 5వ స్థానంలో కొనసాగుతున్నారు.
6️⃣4️⃣8️⃣ ? @ImRo45
6️⃣4️⃣7️⃣ ? @davidwarner31
6️⃣0️⃣6️⃣ ? @Sah75official
5️⃣7️⃣8️⃣ ? Kane Williamson
5️⃣5️⃣6️⃣ ? @root66These five batsmen were pretty special at #CWC19 pic.twitter.com/vSt5A95sfg
— Cricket World Cup (@cricketworldcup) July 16, 2019