Thomas Cup 2022: భారత బ్యాడ్మింటన్‌ జట్టుకు మోడీ, జగన్‌ అభినందనలు.. రూ. కోటి నజరానా ప్రకటించిన కేంద్ర మంత్రి..

|

May 15, 2022 | 7:07 PM

Thomas Cup 2022: ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) భారత షట్లర్లకు అభినందనలు తెలిపాడు. దేశం మొత్తం ఈ విజయాన్ని చూసి గర్విస్తోందని కొనియాడారు.

Thomas Cup 2022: భారత బ్యాడ్మింటన్‌ జట్టుకు మోడీ, జగన్‌ అభినందనలు.. రూ. కోటి నజరానా ప్రకటించిన కేంద్ర మంత్రి..
Pm Narendra Modi
Follow us on

Thomas Cup 2022: ప్రతిష్ఠాత్మకమైన థామస్ కప్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు విజయకేతనం ఎగరవేసింది. నేడు జరిగిన ఫైనల్స్‌లో 14 సార్లు ఛాంపియన్‌ అయిన ఇండోనేషియాను మట్టి కరిపించి 73 ఏళ్ల తర్వాత స్వర్ణపతకాన్ని ముద్దాడింది. మొదట సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ శుభారంభం అందించగా.. ఆతర్వాత సాత్విక్‌- చిరాగ్‌ బృందం డబుల్స్‌లో విజయ ఢంకా మోగించింది. ఇక చివరి మ్యాచ్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ క్రిస్టీపై ఘన విజయం సాధించి భారత్‌ సగర్వంగా థామస్‌ కప్‌ అందుకునేలా చేశాడు. దీంతో భారత బ్యాడ్మింటన్‌ జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) భారత షట్లర్లకు అభినందనలు తెలిపాడు. దేశం మొత్తం ఈ విజయాన్ని చూసి గర్విస్తోందని కొనియాడారు. ‘భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. వాళ్లు థామస్ కప్ గెలవడం చూసి దేశమంతా సంతోషిస్తోంది. ఈ బృందం భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను. ఈ విజయం ఎందరో క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు.

దేశమంతా గర్విస్తోంది..

ఇవి కూడా చదవండి

ఏపీ సీఎం టీమిండియాకు కంగ్రాట్స్‌ చెప్పారు ‘ భారత బ్యాడ్మింటన్‌కు ఇది చరిత్రాత్మక క్షణం. మొదటిసారిగా థామస్‌ కప్‌ను గెలిచినందుకు భారత జట్టుకు అభినందనలు. ఫైనల్స్‌లో అద్భుతంగా ఆడిన కిదాంబీ శ్రీకాంత్, ఇతర ఆటగాళ్లకు కంగ్రాట్స్‌’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఇక కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ భారత బ్యాడ్మింటన్‌ బృందానికి కోటి రూపాయల నజరానా ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ’14 సార్లు థామస్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాను టీమిండియా ఓడించింది. తొలిసారి టైటిల్ గెలిచింది. ఈ అద్భుత విజయాన్ని సాధించినందుకు గౌరవ సూచకంగా ఈ బృందానికి రూ.కోటి నజరానా ప్రకటిస్తున్నందుకు భారత క్రీడాశాఖ ఎంతో గర్విస్తోంది. కంగ్రాట్స్‌ టీమిండియా’ అంటూ అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

BAI కోటి రివార్డ్..

అదే సమయంలో, బ్యాడ్మింటన్ అసోసియేషన్ తన ఆటగాళ్లను, కోచింగ్ సిబ్బందిని కూడా సత్కరిస్తున్నట్లు ప్రకటించింది. BAI ప్రెసిడెంట్ హేమంత బిస్వా శర్మ తన ట్వీట్‌లో, దేశానికి అవార్డులను తీసుకువచ్చినందుకు అసోసియేషన్ ద్వారా రూ. 1 కోటి రూపాయల రివార్డ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే సహాయక సిబ్బందికి రూ.20 లక్షల రివార్డ్‌ ఇస్తున్నట్లు తెలిపారు.

 

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Viral Video: కొత్తగా పెళ్లైన కోడలిని రోటీలు చేయమన్న అత్త.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే నవ్వులే నవ్వులు..

High BP control tips : హై బీపీతో బాధపడుతున్నారా? అయితే తప్పక తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే..

India vs Indonesia, Thomas Cup Final:: చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్.. తొలిసారి థామస్‌ కప్‌ చేజిక్కించుకున్న భారత్‌..