AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొత్తగా పెళ్లైన కోడలిని రోటీలు చేయమన్న అత్త.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే నవ్వులే నవ్వులు..

Funny Video: పురుషులతో పాటు మహిళలు కూడా వంటగదిలోకి వెళ్లే సమయం ఉండడం లేదు. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళల్లో కొందరికి అసలు వంట చేయడమే తెలియదు. అందుకే పెళ్లై అత్తారింటికీ వెళ్లినప్పుడు వంట చేయమంటే దిక్కులు చూస్తున్నారు

Viral Video: కొత్తగా పెళ్లైన కోడలిని రోటీలు చేయమన్న అత్త.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే నవ్వులే నవ్వులు..
Basha Shek
|

Updated on: May 15, 2022 | 5:49 PM

Share

Funny Video: మనలో చాలామందికి వండింది తినిపెట్టడం మాత్రమే తెలుసు. కనీసం వంటగదిలో కెళ్లి కనీసం గరిటె పట్టడం తెలియదు. చదువు, ఉద్యోగం, వ్యాపారం అంటూ ఎక్కువగా బయటి ఫుడ్‌కే అలవాటుడపడిపోయారు. పురుషులతో పాటు మహిళలు కూడా వంటగదిలోకి వెళ్లే సమయం ఉండడం లేదు. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళల్లో కొందరికి అసలు వంట చేయడమే తెలియదు. అందుకే పెళ్లై అత్తారింటికీ వెళ్లినప్పుడు వంట చేయమంటే దిక్కులు చూస్తున్నారు. ఈక్రమంలో కొత్తగా పెళ్లై అత్తారింట అడుగుపెట్టిన ఓ ఇంజనీర్ కోడలు పడే వంట కష్టాలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో వివాహమైన మరుసటి రోజే కోడలిని ఆమె అత్తగారు కిచెన్‌లోకి తీసుకెళుతుంది. అయితే కోడలికి మాత్రం వంట చేయడంలో అంతగా ప్రావీణ్యం ఉండదు. దీంతో తన అత్తగారి సూచనలతో రోటీలు చేయడం ప్రారంభిస్తుంది.

రోటీ ఎలా తిప్పేసిందంటే..

కాగా కోడలు పెనం మీద రోటీ కాల్చుతుండగా.. అలా కాదు కాల్చేది అని అత్త చెబుతుంది. రోటీ మాడిపోతుంది వెంటనే తిప్పివేయి అని అత్తగారు చెప్పగానే .. కోడలు పెనం లేపి స్టవ్ మీద వేస్తుంది. దీంతో ఆ కోడలు వంట చేసే తీరు చూసి అత్తగారు తల పట్టుకుంటుంది. ఇది కూడా తెలియదా? అంటూ కోడలి తలపై ఒక్కటిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ అత్తా- కోడళ్ల కామెడీని నెటిజన్లు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఫన్నీ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఈ అత్తా కోడళ్లు భలేగున్నారు’, ‘ఇలాంటి కోడళ్లకు కిచెన్‌ అప్పగిస్తే అంతే సంగతులు’ అంటూ స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

High BP control tips : హై బీపీతో బాధపడుతున్నారా? అయితే తప్పక తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే..

Andrew Symonds Death: ఇంత త్వరగా వెళ్లిపోయావా ఫ్రెండ్‌? సైమండ్స్ ఆకస్మిక మరణంపై భజ్జీ సంతాపం..

India vs Indonesia, Thomas Cup Final:: చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్.. తొలిసారి థామస్‌ కప్‌ చేజిక్కించుకున్న భారత్‌..