Paris Olympics 2024: పీవీ సింధుకు రెండో విజయం.. ప్రీ క్వార్టర్స్‌కు హైదరాబాదీ షట్లర్.. తర్వాతి మ్యాచ్ ఎప్పుడంటే?

|

Jul 31, 2024 | 4:02 PM

పారిస్ ఒలింపిక్స్ లో తెలుగు తేజం పీవీ సింధు వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం (జులై 31) మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ఎస్టోనియా క్రీడాకారిణి క్రిస్టిన్ కూబా ను ఓడించి తదుపరి రౌండ్ కు దూసుకెళ్లింది. ఆరంభం నుంచి చక్కటి నియంత్రణను ప్రదర్శించిన సింధు.. తొలి సెట్ లోనే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలమైంది.

Paris Olympics 2024: పీవీ సింధుకు రెండో విజయం.. ప్రీ క్వార్టర్స్‌కు హైదరాబాదీ షట్లర్.. తర్వాతి మ్యాచ్ ఎప్పుడంటే?
PV Sindhu
Follow us on

పారిస్ ఒలింపిక్స్ లో తెలుగు తేజం పీవీ సింధు వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం (జులై 31) మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ఎస్టోనియా క్రీడాకారిణి క్రిస్టిన్ కూబా ను ఓడించి తదుపరి రౌండ్ కు దూసుకెళ్లింది. ఆరంభం నుంచి చక్కటి నియంత్రణను ప్రదర్శించిన సింధు.. తొలి సెట్ లోనే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలమైంది. తదనుగుణంగానే 21-9 పాయింట్ల భారీ తేడాతో మొదటి సెట్‌ను గెల్చుకుందీ హైదరాబాదీ షట్లర్. అయితే రెండో సెట్ ప్రారంభంలో క్రిస్టీన్ కూబా వైపు నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. కానీ పీవీ సింధు అనుభవం ముందు అవేవీ పనిచేయలేదు. దీనికి తోడు మధ్యలో లయ కోల్పోయిన క్రిస్టీన్ కూబా వరుస తప్పిదాలు చేసింది. అదే సమయంలో సింధు దూకుడుగా ఆడింది. దీంతో 21-10 పాయింట్ల తేడాతో రెండో సెట్‌ తో పాటు మ్యాచ్ ను కూడా వశం చేసుకుంది మన తెలుగు తేజం. కాగా ఆధ్యంతం దూకుడుగా ఆడిన సింధు కేవలం 34 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ను ముగించడం విశేషం.ఈ విజయంతో పీవీ సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.

పీవీ సింధు ఇలాగే ఆడితే ఒలింపిక్స్‌లో ఆమె నుంచి మరో పతకం ఆశించవచ్చు. గత రెండు ఒలింపిక్స్‌లో నూ బ్యాడ్మింటన్ విభాగంలో భారత కీర్తిని చాటిచెప్పందీ స్టార్ షట్లర్. 2016లో రియో ​​ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కాబట్టి ఈసారి కూడా పీవీ సింధు నుంచి బంగారు పతకం ఆశిస్తున్నారు క్రీడాభిమానులు. కాగా రౌండ్ 16లో సింధు విజయం సాధిస్తే నేరుగా క్వార్టర్‌ పైనల్స్‌కు చేరుతుంది. మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే తప్పకుండా పతకం గెలిచే అవకాశాలున్నాయి. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిస్తే నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

వరుస సెట్లలో పీవీ సింధు విజయం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..