పాక్ మారణహోమం.. వైమానిక దాడిలో ముగ్గురు క్రికెటర్లు మృతి.. ట్రై సిరీస్ రద్దు..
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు క్రికెటర్ల ప్రాణాలు తీశాయి. పాక్టికా ప్రావిన్స్‌లో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లు మరణించారు. క్రికెటర్లతో పాటు 8 మంది మృతి చెందారు. క్రికెటర్లు కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. గత వారం కాబూల్‌లోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ స్థావరాలపై దాడి చేయడంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయి. బుధవారం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇంతలోనే శుక్రవారం రాత్రి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌పై వైమానిక దాడులతో విరుచుకపడింది. ఈ దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు సహా 8మంది మరణించారు.
గ్రాస్‌రూట్ హీరోలు
పాకిస్తాన్ వైమానిక దాడులు ఆఫ్ఘన్ క్రికెట్‌లో తీవ్ర విషాదాన్ని నింపాయి. పాక్టికా ప్రావిన్స్‌లో జరిగిన ఈ దాడిలో ముగ్గురు స్థానిక క్లబ్ క్రికెటర్లతో సహా ఐదుగురు మరణించారు. క్రికెటర్లు కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. ప్రావిన్షియల్ రాజధాని షరానాలో జరిగిన స్థానిక టోర్నమెంట్ నుండి ఆటగాళ్లు అర్గున్ జిల్లాకు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రణించిన ఆటగాళ్లను ఆఫ్ఘన్ క్రికెట్ యొక్క గ్రాస్‌రూట్ హీరోలుగా అభివర్ణించింది.
ట్రై సిరీస్ రద్దు
పాక్టికా వైమానిక దాడుల్లో దేశీయ ఆటగాళ్లు మరణించిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్‌లో జరగాల్సిన పాకిస్తాన్, శ్రీలంకతో కూడిన ముక్కోణపు T20 సిరీస్‌లో పాల్గొనకూడదని నిర్ణయించింది. ఆటగాళ్ల మరణాల పట్ల నిరసనగా, జాతీయ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆఫ్ఘన్ స్టార్ క్రికెటర్ల ఆగ్రహం
ఈ దాడిని ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు. రషీద్ ఖాన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. “ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడుల్లో పౌరులు మరణించడం నాకు చాలా బాధ కలిగించింది. ప్రపంచ వేదికపై తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న మహిళలు, పిల్లలు, యువ క్రికెటర్ల ప్రాణాలను బలిగొన్న విషాదం ఇది. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా అనాగరికం. పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌ల నుండి వైదొలగాలని ACB తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. దేశమే అన్నింటికంటే ముఖ్యం ” అని రాసుకొచ్చారు.
Statement of Condolence
The Afghanistan Cricket Board expresses its deepest sorrow and grief over the tragic martyrdom of the brave cricketers from Urgun District in Paktika Province, who were targeted this evening in a cowardly attack carried out by the Pakistani regime.
In… pic.twitter.com/YkenImtuVR
— Afghanistan Cricket Board (@ACBofficials) October 17, 2025




