Tokyo Paralympics: నేటి నుంచి ప్రారంభం కానున్న పారా ఒలింపిక్స్.. భారత్ పాల్గొనే ఈవెంట్స్ 27నుంచి స్టార్ట్

|

Aug 24, 2021 | 11:50 AM

Para Olympics: టోక్యోలో మళ్ళీ ఒలింపిక్స్ సంబరం మొదలు కానుంది. నేటి నుంచి జపాన్ రాజధాని టోక్యో వేదికగా పారా ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కరోనా నిబంధనలను అనుసరిస్తూ.. ఒలింపిక్స్ కు..

Tokyo Paralympics: నేటి నుంచి ప్రారంభం కానున్న పారా ఒలింపిక్స్.. భారత్ పాల్గొనే ఈవెంట్స్ 27నుంచి స్టార్ట్
Tokyo Paralympics
Follow us on

Tokyo Paralympics 2020: టోక్యోలో మళ్ళీ ఒలింపిక్స్ సంబరం మొదలు కానుంది. నేటి నుంచి జపాన్ రాజధాని టోక్యో వేదికగా పారా ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కరోనా నిబంధనలను అనుసరిస్తూ.. ఒలింపిక్స్ కు అన్ని సిద్ధం చేశారు. ఈ పారా ఒలింపిక్స్ క్రీడల్లో మొత్తం 163 దేశాల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు పాల్గొన‌బోతున్నారు. మొత్తం 22 క్రీడాంశాల్లో 540 ప‌త‌క ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఇప్పుడు జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్, తైక్వాండో పోటీలను ప్రవేశపెట్టనున్నారు.

ఇక పారా ఒలింపిక్స్ లో 54మంది సభ్యులతో కూడిన భారత్ బృందం పాల్గొననుంది. అయితే 27నుంచి జరగనున్న ఈవెంట్స్ లో భారత క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ పోటీల్లో భారత్ నుంచి ఫేవరేట్ క్రీడాకారులుగా పారాలింపిక్‌ చాంపియన్లు దేవేంద్ర జఝారియా (ఎఫ్‌–46 జావెలిన్‌ త్రో), మరియప్పన్‌ తంగవేలు (టి–63 హైజంప్‌), ప్రపంచ చాంపియన్‌ సందీప్‌ చౌదరి (ఎఫ్‌–64 జావెలిన్‌ త్రో) బరిలోకి దిగనున్నారు.

ఇప్పటికే ఏథెన్స్‌(2004), రియో (2016) పారాలింపిక్స్‌లో పసిడి పతకాలను గెలుచుకున్న దేవేంద్ర మూడో సారి గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుంటున్నారు. గత పారాలింపిక్స్‌లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శనతో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం గెలుపొందింది.

పారా ఒలింపిక్స్ లో భారత జట్టు క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి పతకాలను తీసుకుని రావాలని యావత్ క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు పారాలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్, భారత పారాలింపిక్‌ సంఘం అధికారులు, క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రికెటర్లు కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, భారత రెజ్లర్ రితూ ఫోటర్, యోగేశ్వర్ దత్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్, ఒలింపిక్ విన్నర్ కరణం మల్లీశ్వరి, బీసీసీఐ సెక్రటరీ జై షా తదితరులు శుభాకాంక్షలు తెలియచేశారు.

Also Read:  షూటింగ్‌లో గాయపడిన అభిషేక్ బచ్చన్.. ఆలస్యంగా వెలుగులోకి.. ఆందోళనలో ఫ్యాన్స్