WFI: అనురాగ్ ఠాకూర్‌ హామీతో రెజర్ల సమ్మె విరమణ..విచారణ పూర్తయ్యే వరకు ఫెడరేషన్‌కు దూరంగా అధ్యక్షుడు..

|

Jan 21, 2023 | 6:35 AM

Indian Wrestlers: వినేష్ ఫోగట్, బంజ్రాగ్ పునియా, సాక్షి మాలిక్, రవి దహియాతో సహా మిగతా రెజర్లంతా కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెండవ రౌండ్ చర్చల తర్వాత తమ సమ్మెను ముగించాలని నిర్ణయించుకున్నారు.

WFI: అనురాగ్ ఠాకూర్‌ హామీతో రెజర్ల సమ్మె విరమణ..విచారణ పూర్తయ్యే వరకు ఫెడరేషన్‌కు దూరంగా అధ్యక్షుడు..
Wrestlers End Strike Confid
Follow us on

ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో రెజ్లర్లు రెండు రోజుల పాటు చేపట్టిన నిరాహార దీక్ష ముగిసింది. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రెజ్లర్లు సమ్మె విరమించారు. అదే సమయంలో, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ విషయాన్ని మానిటరింగ్ కమిటీ విచారించే వరకు పదవి బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. రెజ్లర్ బజరంగ్ పునియా మాట్లాడుతూ కేంద్ర క్రీడా మంత్రి మా డిమాండ్లను విని, తగిన విచారణకు హామీ ఇచ్చారని తెలిపాడు. నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. న్యాయమైన విచారణ జరుగుతుందని మేం ఆశిస్తున్నాం, కాబట్టి మేం సమ్మెను విరమిస్తున్నాం’ అంటూ ప్రకటించారు.

ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునియా, సాక్షి మాలికా, ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేత వినేష్ ఫోగట్‌లతో సహా చాలా మంది రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్‌పై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారంటూ సమ్మెకు దిగారు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నివాసంలో విలేకరుల సమావేశం..

క్రీడాకారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై అందరూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలాంటి సంస్కరణలు కోరుకుంటున్నారో ఈ విషయం కూడా తెరపైకి వచ్చింది. ఓవర్‌సైట్ కమిటీని ఏర్పాటు చేశాం. ఇది తదుపరి 4 వారాల్లో విచారణను పూర్తి చేస్తుంది. విచారణ పూర్తయ్యే వరకు రోజువారీ కార్యకలాపాలను కమిటీ చూస్తుందని తెలిపారు. అప్పటి వరకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్ దూరంగా ఉంటారని చెప్పుకొచ్చారు. అలాగే విచారణకు సహకరిస్తారని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం: భజరంగ్

అదే సమయంలో క్రీడాకారులందరికీ కేంద్ర మంత్రి (అనురాగ్ ఠాకూర్) హామీ ఇచ్చారని రెజ్లర్ బజరంగ్ పునియా తెలిపారు. అందరికీ వివరణ కూడా ఇచ్చారు. ప్రభుత్వం హామీ ఇచ్చినందున ఆటగాళ్లు మేం మా ఆందోళనను విరమిస్తున్నాం. మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..