AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG 2022: ఆరంభానికి ముందే భారత్‌కు భారీ దెబ్బ.. పోటీల నుంచి తప్పుకున్న అథ్లెట్.. ఎందుకంటే?

కామన్వెల్త్ గేమ్స్ (CWG), షాట్‌పుట్‌తో సహా అనేక ఈవెంట్‌లలో భారత్ బంగారు పతకాలు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

CWG 2022: ఆరంభానికి ముందే భారత్‌కు భారీ దెబ్బ.. పోటీల నుంచి తప్పుకున్న అథ్లెట్.. ఎందుకంటే?
Cwg 2022 Shot Put Athlet Ajinderpal Singh Toor
Venkata Chari
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 21, 2022 | 5:18 PM

Share

కామన్వెల్త్ గేమ్స్ 2022(CWG 2022)కి ముందు భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆసియాలో అత్యంత విజయవంతమైన షాట్‌పుట్ ప్లేయర్ తజిందర్‌పాల్ సింగ్ టూర్(Tajinderpal Singh Toor) కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు టూర్ ప్రస్తుతం USలో ఉన్నారు. అయితే శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనలేదు. ఆ తర్వాత అతనికి గజ్జల్లో గాయం అయ్యిందని, అందుకే కామన్వెల్త్ గేమ్స్ నుంచి కూడా వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జులై 28 నుంచి ఇంగ్లండ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో ఈసారి కూడా భారత్ నుంచి 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. అయితే బర్మింగ్‌హామ్‌లో జరగనున్న ఈ క్రీడల్లో దేశానికి చెందిన దిగ్గజ అథ్లెట్లు ఈసారి కనిపించరని తెలిసి అభిమానులు నిరాశ పడుతున్నారు.

ఈ జాబితాలో మొదటి పేరు ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ ఉన్నారు. దేశంలోని యువ క్రీడాకారులకు అవకాశం కల్పించేందుకు మేరీకోమ్ కామన్వెల్త్ క్రీడల్లో తాను పాల్గొనబోనని ఇప్పటికే ప్రకటించింది. అందుకే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొనలేదు. 2018లో ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో మేరికోమ్ స్వర్ణం సాధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..