TV9 Indian Tigers and Tigresses: ఫుట్‌బాల్ ఛాంపియన్‌ల కల సాకారం.. ఆస్ట్రియాలో మొదలైన శిక్షణ

TV9 Indian Tigers and Tigresses: టీవీ9 నెట్‌వర్క్ చేపట్టిన విలక్షణమైన టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్సెస్‌‌లో వేలాది మంది ప్రతిభావంతులైన పిల్లలు పాల్గొన్నారు. కానీ, కేవలం 28 మంది క్రీడాకారులకు మాత్రమే ఆస్ట్రియాకు వెళ్లి, అక్కడ శిక్షణ పొందే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆస్ట్రియాలో వారు శిక్షణ ప్రారంభించారు.

TV9 Indian Tigers and Tigresses: ఫుట్‌బాల్ ఛాంపియన్‌ల కల సాకారం.. ఆస్ట్రియాలో మొదలైన శిక్షణ
Tv9 Indian Tigers And Tigresses

Edited By:

Updated on: Apr 01, 2025 | 11:49 AM

TV9 Indian Tigers and Tigresses:  భారత ఫుట్‌బాల్‌‌లో టీవీ9 నెట్‌వర్క్ చేపట్టిన విలక్షణమైన టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్సెస్ ఓ సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ఆకట్టుకున్న ఈ ప్రోగ్రాం తాజాగా అంతర్జాతీయ తీరాలకు చేరుకుంది. భారతదేశంలోని ఎంటో ట్యాలెంట్ ఉన్న యువ ఫుట్‌బాల్ క్రీడాకారులు అంతర్జాతీయంగా ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో 12 మంది బాలికలు, 16 మంది బాలురు తమ కలలను సాకారం చేసుకునే పనిలో మరో ముందడుగు వేశారు. ముగ్గురు భారతీయ కోచ్‌లతో కలిసి ఆస్ట్రియాలో అడుగుపెట్టారు.

ఈ యంగ్ ప్లేయర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు కూడా లభించిన సంగతి తెలిసిందే. మార్చి 28, శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన టీవీ9 ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ సమ్మిట్‌లో ఈ 28 మంది ఫుట్‌బాల్ ఛాంపియన్‌లకు పీఎం మోడీ చారిత్రాత్మక వీడ్కోలు పలికారు.

ఈ ట్యాలెంట్ ప్రోగ్రాంను దాని ప్రత్యేకతను ప్రశంసించిన ప్రధాని మోదీ.. ఈ చొరవ భారత ఫుట్‌బాల్ భవిష్యత్తును మార్చడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.

చారిత్రాత్మక ప్రయాణం ప్రారంభం..

ఫిబ్రవరి 11న ఢిల్లీలో ట్రయల్స్‌తో ప్రారంభమైన ఈ కార్యక్రమం దేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేయడంలో కీలకంగా మారింది.భారత క్రీడా చరిత్రలో అతిపెద్ద ఫుట్‌బాల్ ట్యాలెంట్ హాంట్‌లో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆటగాళ్లు హాజరయ్యారు. వీరిలో 12 నుంచి 14 సంవత్సరాలు, అలాగే 15 నుంచి 17 ఏళ్ల మధ్య రెండు గ్రూపులుగా ప్లేయర్లను ఎన్నుకున్నారు.

ఈ ట్రయల్స్‌లో వేలాది మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే, ఇంతమందిలో కేవలం 28 మంది ఆటగాళ్లకు మాత్రమే ఆస్ట్రియాకు ప్రయాణించే ఛాన్స్ దక్కింది. ఇక్కడ అత్యుత్తమమైన శిక్షణ పొందే సువర్ణావకాశం లభించింది.

ఈ 28 మంది క్రీడాకారులు తమ తల్లిదండ్రులకు భావోద్వేగ వీడ్కోలు పలికి, ఆస్ట్రియాకు వెళ్లే మార్గంలో ఢిల్లీ నుంచి విమానంలో ఇస్తాంబుల్‌కు చేరుకుని, కొద్దిసేపు బస చేశారు.

తొలి శిక్షణ మొదలు..

ఆస్ట్రియాలోని గ్ముండెన్‌కు చేరుకున్న ఈ 28 మంది ప్లేయర్లు పలువురు యూరోపియన్ కోచ్‌లతో వేర్వేరుగా నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పలు మెలుకువలు నేర్చుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..