Bachendri Pal: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ బచేంద్రీ పాల్.. సరిగ్గా 37 ఏళ్ల క్రితం ఇదే రోజు కొత్త చరిత్ర!
Bachendri Pal: అది ఒక సరికొత్త చరిత్ర. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్.. శారీరకంగా ధృఢంగా ఉండే పురుషులే ఆ శిఖరాన్ని ఎక్కడానికి తిప్పలు పడతారు.

Bachendri Pal: అది ఒక సరికొత్త చరిత్ర. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్.. శారీరకంగా ధృఢంగా ఉండే పురుషులే ఆ శిఖరాన్ని ఎక్కడానికి తిప్పలు పడతారు. అందులోనూ ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితం స్త్రీలు బయటకు రావడానికే క్లిష్టమైన పరిస్థితులు. వారి పట్ల సమాజంలో చిన్నచూపు. అటువంటి పరిస్థితుల్లో తాను ఎవరెస్ట్ ఎక్కి తీరాలన్న కలను నిజం చేసుకోవడమే కాకుండా.. భారతీయ మహిళల ఆత్మవిశ్వాసం.. ఎంత గొప్పగా ఉంటుందో రుజువు చేశారు
బచేంద్రీ పాల్. సరిగ్గా 37 ఏళ్ల క్రితం 1984లో ఇదేరోజు (మే 23) ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ఇంకో విషయం ఏమిటంటే ఆమె పుట్టినరోజుకు సరిగ్గా ఒక్కరోజు ముందు తన కలను సాకారం చేసుకున్నారు. ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి భారతీయ మహిళ.. ప్రపంచంలో ఐదో మహిళ బచేంద్రీ పాల్.
బచేంద్రీ పాల్ 24 మే 1954 న భారతదేశంలోని ఉత్తరాఖండ్ లోని గర్హ్వాల్ జిల్లాలోని నకురి అనే గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి ఒక వ్యాపారవేత్త. ఆయన తన గోధుమలు, బియ్యం, ఇతర వస్తువులను టిబెట్ కు తీసుకువెళ్ళి అమ్ముకుంటూ ఉండేవారు. బచెంద్రీ పాల్ చిన్నప్పటి నుంచీ క్రీడలతో పాటు విద్యలో కూడా ముందుండేవారు. బచేంద్రీ ఒకప్పుడు పాఠశాల పిక్నిక్ సందర్భంగా సుమారు 13 వేల అడుగుల ఎత్తువరకూ ఎక్కారు. అక్కడ వరకూ చేరుకున్న తరువాత, వాతావరణం చెడుగా మారింది. దాంతో బచేంద్రీ కొండపైనే రాత్రి గడపవలసి వచ్చింది. దీంతో ఆమెను పర్వతారోహకురాలిగా చూడటానికి ఆమె కుటుంబం ఇష్టపడలేదు.
కాని, బచేంద్రీ పట్టుబట్టడం వల్ల చేసేదేమీ లేక ఆమెను నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్వతారోహణలో చేరారు. 1984 లో, ఎవరెస్ట్ అధిరోహించడానికి భారతదేశం ఒక యాత్రా బృందాన్ని ఏర్పాటు చేసింది. జట్టుకు “ఎవరెస్ట్ -84” అని పేరు పెట్టారు. బచేంద్రీ పాల్ కాకుండా, ఈ జట్టులో 11 మంది పురుషులు మరియు 5 మంది మహిళలు ఉన్నారు. మే ప్రారంభంలో, జట్టు తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రమాదకరమైన వాతావరణం, నిటారుగా ఎక్కడం మరియు తుఫానుల నేపథ్యంలో బచేంద్రీ ఎన్నో కష్టాలకు ఓర్చుకుని మే 23న ఎవరెస్ట్‌ను జయించారు. ఆమెకు పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చి ప్రభుత్వం సత్కరించింది.
బచేంద్రీ పాల్ జీవితంలో కొన్ని ముఖ్యఘట్టాలు..
1954: బచేంద్రీ మే 24వ తేదీన భాటియా కుటుంబంలో జన్మించారు. ఈమె పుట్టిన స్థలం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాకు చెందిన నాకురి గ్రామం. 1984: బచేంద్రీ 22 మే 1984 రోజు ఎవరెస్ట్ పర్వతం ఎక్కడానికి అంగ్ దార్జే అనే షెర్పాతొ పాటు ఉన్న పదకొండు మంది ఎవరెస్ట్ ఆరోహకుల టీంతో కలిశారు. అక్కడ వరకూ చేరుకున్న ఆ టీంలో బచేంద్రీ ఒక్కరే మహిళ!
1984: మే 23, 1984 మధ్యాహ్నం సరిగ్గా 1:07 గంటలకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. చరిత్ర సృష్టించారు.
2013: బచేంద్ర పాల్, ప్రేమ్‌లతా అగర్వాల్‌తో పాటు మౌంట్ సహా ఏస్ క్లైంబర్స్ బృందం ఉత్తరకాశికి చేరుకుని, 2013 ఉత్తర భారత వరదల్లో నాశనమైన హిమాలయాల యొక్క ఎత్తైన గ్రామాలలో సహాయక చర్యలను చేపట్టాయి.
2013: సాహస క్రీడలు, దేశంలో మహిళల అభ్యున్నతి కోసం ఆమె వ్యక్తిగతంగా చేసిన కృషికి గానూ 18 జూన్ 2013 న గ్వాలియర్‌లో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మొట్టమొదటగా ప్రవేశపెట్టిన లక్ష్మీబాయి రాష్ట్రీయ సమ్మన్ 2013–14 మొదటి అవార్డు బచేంద్ర పాల్ కు ఇచ్చారు.
2019: భారతదేశ మూడో అత్యున్నత పురస్కారం అయిన పద్మభూషణ్ అవార్డ్ ఉను కేంద్ర ప్రభుత్వం ఆమెకు 2019లో ఇచ్చి సత్కరించింది.
Also Read: Sushil Kumar: హత్య కేసులో.. ఎట్టకేలకు రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్..! ఎక్కడ పట్టుబడ్డాడంటే..?