Narendra Modi: పారాలింపిక్స్ పతక విజేతలతో మాట్లాడిన ప్రధాని మోడీ.. ఏమన్నారంటే?

Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 6 పతకాలు సాధించింది. ఇప్పటి వరకు భారత్ 1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్య పతకాలు సాధించింది. దేశం తరపున పతకాలు సాధించిన విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. మోనా అగర్వాల్, ప్రీతి పాల్, మనీష్ నర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్‌లతో ఫోన్‌లో మాట్లాడాడు.

Narendra Modi: పారాలింపిక్స్ పతక విజేతలతో మాట్లాడిన ప్రధాని మోడీ.. ఏమన్నారంటే?
Narendra Modi
Follow us
Venkata Chari

|

Updated on: Sep 02, 2024 | 9:33 AM

Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 6 పతకాలు సాధించింది. ఇప్పటి వరకు భారత్ 1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్య పతకాలు సాధించింది. దేశం తరపున పతకాలు సాధించిన విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. మోనా అగర్వాల్, ప్రీతి పాల్, మనీష్ నర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్‌లతో ఫోన్‌లో మాట్లాడాడు. పతకం సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్‌లో సాధించిన ప్రతి పతకం భారత్‌ను ఎంతగానో గర్వించేలా చేసిందని ప్రధాని తెలిపారు.

అలాగే, అవ్నీ లేఖాకు కూడా నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అవ్నీ మాత్రం టెలిఫోన్ కాల్‌కు హాజరు కాలేకపోయింది. పారాలింపిక్ ఈవెంట్‌లో ఉన్నందున ప్రధానితో మాట్లాడడం కుదరలేదు. అయితే, ఆమె విజయం ప్రతి భారతీయుడికి ఎంత గర్వకారణం అంటూ మోడీ తెలిపారు. కొన్ని వారాల క్రితం పారిస్ సమ్మర్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారందరికీ ప్రధాని ఫోన్ చేసి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. మను భాకర్, నీరజ్ చోప్రాతో మాట్లాడారు. ఇదే క్రమంలో పారాలింపియన్లతోనూ ప్రధాని మోదీ మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

ఆగస్టు 29 నుంచి పారిస్‌లో పారాలింపిక్స్ ప్రారంభమయ్యాయి. రెండో రోజు పారా షూటర్ అవ్నీ లేఖా స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు టోక్యో పారాలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అవ్నీ స్వర్ణం సాధించింది. టోక్యో పారాలింపిక్స్ తర్వాత, పారిస్ పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించింది.

అథ్లెట్లతో మాట్లాడిన ప్రధాని మోదీ..

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్ ఫైనల్లో మనీష్ నర్వాల్ రజతం సాధించాడు. ప్రీతి పాల్ 2 కాంస్యాలు సాధించింది. ప్రీతి మహిళల 100 మీటర్ల T35 ఫైనల్, 200 మీటర్లలో రెండు పతకాలు సాధించింది. పారా షూటర్ మోనా అగర్వాల్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో కాంస్యం సాధించింది. ఎయిర్ పిస్టల్‌లో రుబీనా ఫ్రాన్సిస్ కూడా కాంస్యం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..